తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ: ఎంపిడివో ఇందిరా
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని ( Bathukamma Festival), మోటకొండూరు ఎంపిడివో ఇందిరా(MPDO Indira) అన్నారు.
సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) మోటకొండూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో ఇందిర మాట్లాడుతూ అన్ని దేవతలను పూలతో కొలుస్తుండగా,తీరొక్క పూలతో బతుకమ్మలను కొలచే అత్యంత విశిష్టమైన పండుగని అన్నారు.
ప్రతి సంవత్సరం ఆడబిడ్డలు అంతా ఒక్క దగ్గర ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగను రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారన్నారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ యశోద,ఎపిఓ అరుణ కుమారి,టిఎలు స్వామి, చంద్రమోహన్,మంగ,సిఓ లు అలువేలుమంగ,సిద్ది మల్లేశ్,పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
గర్ల్‌ఫ్రెండ్ వదిలేసిందని దోమల మందు తాగిన యువకుడు.. వీడియో వైరల్..