యాదాద్రి భువనగిరి జిల్లా: ఆత్మకూరు మండలంలోని రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు.దసరా పండుగ వరకైనా రైతు భరోసా ( Rythu Bharosa )వస్తుందని అనుకున్న రైతులకు ఆశలు అడియాశలయ్యే సూచనలు కనిపించడంతో అన్నదాతల్లో నైరాశ్యం నెలకొంది.
వానకాలం పంటల సీజన్ పూర్తి కావస్తుంది.వరి కోతలు కూడా అప్పుడే ప్రారంభ మయ్యాయి.ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా ఎకరాకు 15 వేల పెట్టుబడి సహాయం అందజేస్తామని ఎన్నికల హామీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ) హామీ ఇచ్చారు.10 మాసాలు గడుస్తున్నప్పటికీ రైతు భరోసా ప్రారంభించలేదు.
ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.ఇది ఇలా ఉంటే రుణమాఫీ ( Runamafi )ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైతు భరోసా ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఎంతకాలం పడుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు.