సూర్యాపేట జిల్లా:(Suryapet District)భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా కందగట్ల గ్రామానికి గోగుల శేఖర్ రెడ్డి(Gogula Shekhar Reddy ఎన్నికయ్యారు.ఆదివారం మండలంలోని నెమ్మికల్ లో జరిగిన వికలాంగుల హక్కుల పరిరక్షణ(Protection of rights of persons with disabilities_ సమితి ఎన్నికల్లో ప్రత్యర్థి కుర్ర గోపి యాదవ్ పై 15 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ నియామక పత్రాన్ని అందజేసి,శుభాకాంక్షలు తెలిపారు.కొడంగల్ కేంద్రంగా త్వరలోనే నిర్వహించబోయే నిరసన కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా నుంచి భారీగా వికలాంగుల తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కుర్ర గోపి యాదవ్,జిల్లా సీనియర్ నాయకులు మున్న మధు యాదవ్,జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుర్రం నరేష్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు కొండ సైదులు,మహిళా నాయకురాలు వీరమ్మ, మంచాల వెంకన్న,గుంటి శివ,కృష్ణ,రాంబాబు,భిక్షం, రామచంద్రు,షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.