శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్( Gopichand ) హీరోగా నటించిన చిత్రం విశ్వం( Vishvam ).అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
దసరా పండుగ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు శ్రీను వైట్ల తన సినీ జర్నీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ఒకానొక టైమ్ లో నా ఫార్మాట్, థీమ్‌లు చాలా రిపీటెడ్‌గా అవ్వడంతో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
అందుకే ఈ సారి కాస్త మార్చాను అని చెప్పుకొచ్చారు.విశ్వం మూవీ ఎమోషనల్‌గా, కమర్షియల్‌గా ఉంటూనే నా స్టైల్ కామెడీ ఉంటుందని అన్నారు.అమర్ అక్బర్ ఆంటోనీ మూవీని సీరియస్ నోట్‌లోనే చేశాము.
అది ప్రయోగం అని తెలిసే చాలా తక్కువ బడ్జెట్‌లోనే చేశాము.నిర్మాతలకు హ్యాపీ.
కానీ నాకు మాత్రం చెడ్డ పేరు వచ్చింది.అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది.
సినిమా కేవలం నిర్మాతల కోసమే కాదు.నా కోసం కూడా తీసుకోవాలని అనిపించింది.
అందుకే విశ్వం సినిమాను గ్రాండియర్‌గా, నేను అనుకున్నట్టుగా తీశాను అని శ్రీను వైట్ల చెప్పుకొచ్చాడు.
అమర్ అక్బర్ ఆంటోని లాంటి డెప్త్, సీరియస్ మూవీస్ నేను కూడా చేయను కానీ అదేదో అలా చేసేశాను అని అన్నారు శ్రీను వైట్ల.నా చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయి.విశ్వం అనే పాత్ర జర్నీనే విశ్వం సినిమా.
ఆ ప్రయాణంలో అతనికి కష్టాలు వస్తాయి.కానీ వాటిని ఆడియెన్స్‌కి ఎంటర్టైనింగ్ చెప్పాం అని శ్రీను వైట్ల అన్నాడు.
ఇక రవితేజ కోసం ఇప్పుడు ఒక కథను రాశాడట.స్క్రిప్ట్ సిద్దంగానే ఉందని చెప్పుకొచ్చాడు.
ఇక మహేష్ బాబు అయితే ఆగడు తరువాత ఫోన్ చేశాడట.మళ్లీ మనం చేద్దామని అన్నాడట.
కథ ఉంటే రండి అని అడిగాడట.కానీ మళ్లీ మహేష్ బాబు దగ్గరకు వెళ్లలేదని శ్రీను వైట్ల అన్నారు.