200 కోట్ల షేర్ కలెక్షన్లతో దేవర సంచలనం.. గ్రాస్ కలెక్షన్ల లెక్క ఎంతో తెలుసా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కొరటాల శివ మూవీ దేవర( Devara ) సంచలనాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి.200 కోట్ల షేర్ కలెక్షన్లతో దేవర సంచలనం సృష్టించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.10 రోజుల్లో ఈ సినిమాకు ఏకంగా 203 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ల విషయానికి వస్తే ఏకంగా 466 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

 Devara Sensation With 200 Crore Rupees Share Collections Details, Devara, Ntr, D-TeluguStop.com

దసరా సెలవులు మొదలు కావడంతో ఈరోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి.మెజారిటీ థియేటర్లలో ఈ సినిమాకు సంబంధించి 50 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ కనిపిస్తోంది.

దేవర సినిమా కలెక్షన్లు( Devara Collections ) అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.ఫుల్ రన్ లో సులువుగానే ఈ సినిమా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.

Telugu Devara, Koratala Siva, Janhvi Kapoor, Ntr Devara, Saif Ali Khan, Tollywoo

పుష్ప ది రైజ్ సినిమా సాధించిన కలెక్షన్లను ఈ సినిమా సులువుగానే బ్రేక్ చేసింది.ఈ సినిమాకు లాంగ్ రన్ కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.మరికొన్ని రోజుల పాటు ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఈరోజు నుంచి టికెట్ రేట్లు తగ్గడం వల్ల దేవర కలెక్షన్లలో కొంత మొత్తం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Telugu Devara, Koratala Siva, Janhvi Kapoor, Ntr Devara, Saif Ali Khan, Tollywoo

దసరా సెలవులను దేవర ఏ రేంజ్ లో క్యాష్ చేసుకుంటుందో చూడాలి.దసరా సమయానికి దేవర ఎన్ని థియేటర్లలో రన్ అవుతుందనే చర్చ జరుగుతుంది.దేవర ఫుల్ రన్ కలెక్షన్ల లెక్క గురించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.మిక్స్డ్ టాక్ తో కూడా తారక్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేశారనే చెప్పాలి.

దేవర రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube