200 కోట్ల షేర్ కలెక్షన్లతో దేవర సంచలనం.. గ్రాస్ కలెక్షన్ల లెక్క ఎంతో తెలుసా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కొరటాల శివ మూవీ దేవర( Devara ) సంచలనాలు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి.

200 కోట్ల షేర్ కలెక్షన్లతో దేవర సంచలనం సృష్టించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

10 రోజుల్లో ఈ సినిమాకు ఏకంగా 203 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ల విషయానికి వస్తే ఏకంగా 466 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

దసరా సెలవులు మొదలు కావడంతో ఈరోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి.

మెజారిటీ థియేటర్లలో ఈ సినిమాకు సంబంధించి 50 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ కనిపిస్తోంది.

దేవర సినిమా కలెక్షన్లు( Devara Collections ) అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

ఫుల్ రన్ లో సులువుగానే ఈ సినిమా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.

"""/" / పుష్ప ది రైజ్ సినిమా సాధించిన కలెక్షన్లను ఈ సినిమా సులువుగానే బ్రేక్ చేసింది.

ఈ సినిమాకు లాంగ్ రన్ కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.మరికొన్ని రోజుల పాటు ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈరోజు నుంచి టికెట్ రేట్లు తగ్గడం వల్ల దేవర కలెక్షన్లలో కొంత మొత్తం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

"""/" / దసరా సెలవులను దేవర ఏ రేంజ్ లో క్యాష్ చేసుకుంటుందో చూడాలి.

దసరా సమయానికి దేవర ఎన్ని థియేటర్లలో రన్ అవుతుందనే చర్చ జరుగుతుంది.దేవర ఫుల్ రన్ కలెక్షన్ల లెక్క గురించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

మిక్స్డ్ టాక్ తో కూడా తారక్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేశారనే చెప్పాలి.

దేవర రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అశ్విన్‌ రిటైర్‌మెంట్‌పై భార్య ఎమోషనల్ పోస్ట్