సాధారణంగా దొంగతనానికి వెళ్లిన కేటుగాళ్లు అందిన ప్రతి విలువైన వస్తువును పట్టుకెళ్తారు.కానీ ఓ వ్యక్తి మాత్రం చోరికి వెళ్లి ఏ దొంగ ( Thief )చేయని పనులు చేశాడు.
తాను ప్రవేశించిన ఇంట్లోని మహిళ బట్టలు చాలా చక్కగా ఉతికాడు.వాటిని నీట్‌గా చట్టాడు.
వంట కూడా చేసి పెట్టాడు.ఆ మహిళ ఇంటికి వచ్చినప్పుడు, ఆమె ఇంట్లో ఎవరో దొంగతనం చేసినట్లు తెలుసుకుంది.
ఆ దొంగ ఆ ఇంటినే తన ఇంటిలాగా భావించి, ఆ మహిళ చేసే పనులు చేశాడు.అంటే, బట్టలు ఉతికి, భోజనం కూడా చేశాడు.
ఆ తర్వాత, ఆ దొంగ ఆ మహిళకు ఒక లేఖ రాసి వెళ్ళాడు.ఆ లేఖలో, “చింతించకు, సంతోషంగా ఉండు, భోజనం చేయి” అని రాసి ఉంది.
ఈ విచిత్రమైన సంఘటన జరిగినందుకు ఆ మహిళ చాలా భయపడింది.ఎందుకంటే, తన ఇంటికి వచ్చినప్పుడు తన వస్తువులు అన్నీ తారుమారు అయిపోయి ఉన్నాయి.ఈ దొంగకు కార్డిఫ్ కోర్టు 22 నెలల జైలు శిక్ష( Imprisonment ) విధించింది.తన ఇంట్లో దొంగ పడిన చేసిన విషయం తెలుసుకున్న ఆ మహిళ, తన పక్కింటి వాళ్లతో మాట్లాడింది.
ఆమె పక్కింటి వాళ్లు ఎవరో అజ్ఞాత వ్యక్తి బట్టలు ఆరవేస్తున్నట్లు చూశానని చెప్పారు.
“ఆ దొంగను పట్టుకునే వరకు నేను రెండు వారాలు చాలా భయంతో గడిపాను” అని ఆ మహిళ బీబీసీకి చెప్పింది.“ఆ వ్యక్తికి నేను తెలుసునా? నన్ను వెంబడించడం మొదలుపెడతాడా? నేను ఒంటరిగా నివసిస్తున్నానని తెలుసుకొని నన్ను లక్ష్యంగా చేసుకున్నాడా?” అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని.నేను నా ఇంట్లో ఉండేందుకు చాలా భయపడ్డాను కాబట్టి నేను నా స్నేహితురాలి ఇంట్లో ఉండేదాన్ని” అని ఆ మహిళ చెప్పింది.
ఆ దొంగ తన కొత్త బూట్ల పెట్టెను తెరిచి, పెట్టెను రీసైక్లింగ్ బిన్‌లో వేశాడు.అంతేకాకుండా, టూత్‌బ్రష్‌లను మార్చి, వంటసామానులు కూడా తన ఇష్టం వచ్చినట్లు అమర్చాడు.
ఆమె కిరాణా సామానులను బ్యాగుల నుండి తీసి, ఫ్రిజ్‌లో అమర్చాడు.ఫ్రిజ్‌లోని సామానులను కూడా తన ఇష్టం వచ్చినట్లు మార్చాడు.
పక్షులకు( Birds ) ఆహారం పెట్టే పాత్రలను నింపాడు, మొక్కలను మార్చాడు, నేలను తుడుచుకున్నాడు, ఒక ఖాళీ వైన్ బాటిల్‌ను రాక్‌లో ఉంచాడు.వెళ్ళే ముందు, ఆ దొంగ ఆమె ఇంట్లో ఉన్న పదార్థాలతో భోజనం చేశాడు.
ఆ మహిళ ఇంటికి వచ్చినప్పుడు, ఒక గ్లాస్‌లో వైన్ పోసి, ఒక బాటిల్ ఓపెనర్‌తో సహా ఒక రెడ్‌వైన్ బాటిల్‌ను బయట ఉంచినట్లు కనుగొంది.లివింగ్ రూమ్ టేబుల్‌పై స్వీట్ల బౌల్ కూడా ఉంది.
అయితే దొంగను అరెస్టు చేసి చెల్లికి పంపించాక ఆమె ఉపశమనం పొందింది.మళ్లీ ఆ దొంగ ఇటు వైపు రాకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటుంది.