హీరోయిన్స్ కు ఆఫర్లు రావడమే గొప్ప విషయం అనుకుంటూ ఉంటే ఇద్దరు హీరోయిన్స్ మాత్రం తమకు వచ్చిన ఆఫర్లను కాదంటున్నారు.వరుసగా తమ ఆఫర్లను కాదనడం మాత్రమే కాకుండా ఇంకా విభిన్నమైన కథలు కావాలంటున్నారు.
బాహుబలి 2 విడుదల అయినప్పటి నుండి అనుష్క సినిమా ల కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.కానీ ఆమె మాత్రం హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమా లు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
గత నాలుగు సంవత్సరాల్లో ఆమె నుండి వచ్చిన సినిమా లు కేవలం రెండు మాత్రమే.ఇక నివేథా థామస్ విషయానికి వస్తే ఎన్టీఆర్ వంటి స్టార్ తో ఈమె సినిమా చేసే అవకాశం దక్కించుకుంది.
హీరోయిన్ గా మరిన్ని సినిమా ల్లో నటించే అవకాశం ఉందని అంతా భావించారు.
ఇటీవల వకీల్ సాబ్ సినిమా తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కానీ నివేథా మాత్రం కొత్త సినిమా లకు ఓకే చెప్పడం లేదు.ఎందుకు ఈమె కొత్త సినిమా లు చేయడం లేదు అంటే ఏమాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
ఎవరు కూడా హీరోయిన్ గా వచ్చే అవకాశాలు వదులుకోరు.కాని ఈ అమ్మడు మాత్రం ఇప్పటి వరకు వచ్చిన మూడు నాలుగు పెద్ద ఆఫర్లు తిరష్కరించిందనే వార్తలు వస్తున్నాయి.
వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈమెకు వెంటనే ఆఫర్లు వచ్చాయి.సినిమా ల్లో స్కిన్ షో చేస్తేనే ఆఫర్లు వస్తాయి.
కాని ఈమెకు స్కిన్ షో చేయకున్నా కూడా ఆఫర్లు వచ్చి పడ్డాయి.అయినా కూడా ఈమె వాటిని తిరష్కరించింది.
ఇండస్ట్రీ లో కొనసాగే ఉద్దేశ్యం ఉండా లేదా అంటూ కొందరు ఈమె ను ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి వీరిద్దరు మాత్రం సినిమా లు చేయకుండా ఏ ఒక్కరికి అర్థం కావడం లేదు.