అఖండ అదృష్టం( Akhanda ), ఐశ్వర్యం, అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు అనుగ్రహించే అఖండ దైవిక వస్తువుగా శంఖాన్ని భావిస్తారని పండితులు ( Scholars )చెబుతున్నారు.క్షీరసాగర మథనంలో జనించిన పవిత్ర వస్తువులలో ఇది ఒకటి అని చెబుతున్నారు.
కాబట్టే శ్రీమహావిష్ణువు ( Lord Vishnu )చేతిలో పాంచజన్యమనే పేరుతో ఇది స్నానం సంపాదించుకుంది.సంపదకు ప్రతీక అయిన శంఖాన్ని పూజాగదిలో ఉంచితే సకల అరిష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
శంఖంలోని జలాన్ని దేవాలయాలలో తీర్థంగా ఇవ్వడం సంప్రదాయంగా ఉంది.శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అనే నానుడి ఇలా వచ్చినదే అని నిపుణులు చెబుతున్నారు.
అలాగే పూజ ఆరాధన,యజ్ఞ యాగాదులు తాంత్రిక క్రియలలోనూ శంఖాన్ని ఉపయోగిస్తారు.శంఖ ధ్వని విజయానికి సమృద్ధికి, సుఖానికి,కీర్తి ప్రతిష్టలకు లక్ష్మీ ఆగమనానికి ప్రతిక అని కూడా చెబుతున్నారు.శంఖాన్ని అభిషేకించడం వల్ల ఎంతో పుణ్యఫలం అని పండితులు చెబుతున్నారు.ఉత్తరాదినా నది స్నానాల సమయంలో శంకనాథం చేయడం ఆనవాయితీగా వస్తోంది.అలాగే ఇంట్లో దైవరాధనలో భాగంగా శంఖాన్ని పూజిస్తే అఖండ ఫలితాన్ని పొందవచ్చని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
ముఖ్యంగా చెప్పాలంటే శంఖాల స్వరూపం, రంగు తదితర లక్షణాలను బట్టి లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామదేను శంఖం, దైవ శంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణి పుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రాహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖం ముఖ్యమైనవి అని పండితులు చెబుతున్నారు.వీటిలో గోముఖ శంఖం( Gomukha Conch ) అత్యంత విశిష్టమైనది పండితులు చెబుతున్నారు.ఆవు ముఖం అకారంలో ఉండే ఈ శంఖం సముద్రంలో అత్యంత అరుదుగా లభిస్తుంది.
కైలాస మానస సరోవరంలోనూ, శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవులలో ఇవి దొరుకుతాయి.అలాగే శివలింగాన్ని కానీ శివ పర్వతలను గాని పూజించేవారు శివుని పాదాల దగ్గర ఉంచి స్వచ్ఛమైన పూలతో అలంకరించి పూజ చేస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చుని పండితులు చెబుతున్నారు.
TELUGU BHAKTHI