తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది.దాదాపు నెల రోజులపాటు హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది.
సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియగా మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది.ప్రచార పర్వానికి గడువు ముగియడంతో మైకులు మూగబోయాయి.
ప్రచార రథాలు నిలిచిపోయాయి.అయితే ఎల్లుండి తెలంగాణలో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.కాగా మొత్తం 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు.
ఈ క్రమంలోనే డిసెంబర్ 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.







