తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది.దాదాపు నెల రోజులపాటు హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది.

సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియగా మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది.

ప్రచార పర్వానికి గడువు ముగియడంతో మైకులు మూగబోయాయి.ప్రచార రథాలు నిలిచిపోయాయి.

అయితే ఎల్లుండి తెలంగాణలో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

కాగా మొత్తం 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు.ఈ క్రమంలోనే డిసెంబర్ 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

How Wild Robin Works For UK Mobile Players: Skill, Luck, And Geolocation Explained