ప్రతి ఏడాది కార్తీక మాసంలోని( Karthika Masam ) శుక్లపక్ష ఏకాదశి రోజున శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువుకు తులసికి వివాహం అత్యంత వైభవంగా హిందువులు చేస్తారు.అయితే కొందరు సిల్క్ ద్వాదశి అంటూ కార్తిక ద్వాదశి రోజున కూడా తులసి వివాహాన్ని జరుపుతారు.
తులసి మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది.శ్రీమహావిష్ణువు తులసిలేని నైవేద్యాన్ని స్వీకరించాడు.
అయితే పురాణాల ప్రకారం తులసి విష్ణు కంటే ముందు బృందగా రాక్షస వంశానికి చెందిన అసురుడిని వివాహం చేసుకుంది.తులసి విష్ణువుకు మధ్య ఉన్న బంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి పూర్వ జన్మలో బృందా అనే యువతీగా రాక్షసవంశంలో జన్మించిందని నమ్ముతారు.
బృంద యుక్త వయసు వచ్చిన తర్వాత రాక్షశ వంశానికి చెందిన రాజు జలంధరుని వివాహం చేసుకుంది.బృందా చాలా సద్గుణాలు కలిగిన మహిళ, భర్తను దైవంగా భావించి పూజించేది.ఒకసారి జలంధరుడు నేపథ్యంలో దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం మొదలైంది.
అప్పుడు బృందా తన భర్త జలందరుడితో మీరు యుద్ధంలో విజయం సాధించాలని కోరుతూ పూజ చేస్తాను అని చెప్పింది.తన భర్త తిరిగి వచ్చేటంతవరకు పూజా సంకల్పాన్ని విడవని తెలిపింది.
బృంద చెప్పినా తర్వాత జలందరుడు యుద్ధానికి వెళ్ళాడు.బృందా ఉపవాస దీక్ష చేపట్టి పూజ చేయడం ప్రారంభించింది.
బృందా పూజా ప్రారంభం వల్ల దేవతలు కూడా జలందరుడిని ఓడించలేకపోయారు.
దేవతలు ఓడిపోవడం ప్రారంభించిన తర్వాత దేవతలందరూ కలిసి విష్ణు వద్దకు వచ్చారు.బృందా గొప్ప భక్తురాలు తను ఆమెను మోసం చేయలేను అని విష్ణువు సమాధానం ఇచ్చాడు.అయినప్పటికీ తమ గెలుపు కోసం పరిష్కారం దయచేసి చెప్పమని విష్ణు ను వేడుకున్నారు.
దీంతో శ్రీమహావిష్ణువు ( Lord Vishnu )జలంధరుడి రూపాన్ని ధరించి బృంద ఉన్న రాజభనానికి చేరుకున్నాడు.తన భర్తను చూడగానే వెంటనే పూజ చేయడం విరమించి భర్త పాదాలను బృందా తాకింది.
దీంతో బృందా సంకల్పం భగ్నం అయింది.యుద్ధంలో ఉన్న జలంధరుని శిరస్సు రాజభవనంలో బృందా ఉన్న చోట పడింది ,శ్రీమహావిష్ణువు తన భక్తురాలు అయిన బృందతో ఏమీ మాట్లాడలేకపోయాడు.
బృంద కి కోపం వచ్చి విష్ణువు రాయిగా మారమని శపించింది.అప్పుడు దేవతలందరూ బృందా ను ప్రార్ధించిన తర్వాత శాపాన్ని వెనక్కు తీసుకుంది.
ఆ తర్వాత బృందా తన భర్త శిరస్సుతో కలిసి సతిసగమనం చేసింది.బృందా బూడిద నుంచి ఒక మొక్క ఉద్భవించింది అప్పుడు విష్ణువు ఆ మొక్కకు తులసి ( Basil )అని పేరు పెట్టాడు.
అంతేకాకుండా తులసి లేని ఏ నైవేద్యాన్ని తను స్వీకరించనని విష్ణువు.చెప్పాడు.
అప్పటి నుంచి కార్తీక మాసంలో తులసి మాతకు శాలిగ్రామానికి వివాహం చేస్తారు.
LATEST NEWS - TELUGU