ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchagam):
సూర్యోదయం: ఉదయం 05.55
సూర్యాస్తమయం: సాయంత్రం 06.17
రాహుకాలం: ఉ.07.36 నుంచి 09.10 వరకు
అమృత ఘడియలు: ఉ.09.03 నుంచి 09.40 వరకు
దుర్ముహూర్తం: మ.12.27 నుంచి 01.16 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Raasi Palalu):
మేషం:
ఆర్ధిక సమస్యలు తీరే అవకాశం ఉంది.మీ కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు.ఇతరుల గురించి తెలియని విషయాలు మాట్లాడకండి.ఇబ్బందులు పడాల్సి వస్తుంది.ఈరోజు గొప్ప విషయాలను నేర్చుకుంటారు.
వృషభం:
దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని బాధిస్తాయి.ఆస్పత్రిలో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
కుటుంబసభ్యులతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఆనందంగా గడపండి.ఈరోజు కొన్ని చికాకులు ఎదురైనప్పటికి రాత్రి ఆనందంగా నిద్రిస్తారు.
మిథునం:
ఏదైనా కొత్త పని చేసేముందు పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి.మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.
విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంది.ఒకవేళ మీరు కొత్తగా వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అన్ని తెలుసుకొని వాటిలోకి దిగడం మంచిది.
కర్కాటకం:
ఈరోజు ఆర్ధిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.స్నేహితులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.
వినోదం నిండేలాగ గడపడానికి అనువైన రోజు ఇది.ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండడానికి సమయం దొరుకుతుంది.
సింహం:
దగ్గరి బంధువులను కలుస్తారు.వారి సహాయంతో వ్యాపారం బాగా చేస్తారు.
ఆర్ధికంగా కాస్త నష్టం ఉంటుంది.కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు వచ్చే అవకాశం ఉంది.ఆర్ధిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుంటే మంచిది.
కన్య:
మీ ఆశలు, ఆశయాలు ఈరోజు నెరవేరుతాయి.ఈరోజు మీ కష్టానికి ఫలితం ఉంటుంది.గతంలో ఇబ్బంది పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది.ఈరోజు మీరు ఎంతో గొప్పగా ఆనందంగా గడుపుతారు.
తులా:
మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీ మనసు అతిస్పష్టంగా ఉండడం ఎంతో అవసరం.ఈరోజు మీకంటే కూడా పక్కవారి కోసమే ఎక్కువ ఖర్చు పెడుతారు.ఆఫీసులో ఈరోజు మంచి ఎదుగుదల ఉండే అవకాశం ఉంది.
వృశ్చికం:
బ్యాంకులో రుణాల కోసం ఎదురు చూసే మీకు అవి దొరికే అవకాశం ఉంది.మీ స్నేహితులతో బయటకు వెళ్తారు.ఆర్ధిక ఇబ్బందులు తొలిగి మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.
ధనస్సు:
డబ్బును పొదుపు చెయ్యాలి అనుకున్నప్పటికి మీరు చెయ్యలేరు.కొన్ని ఇబ్బందులు మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయి.అయినప్పటికి కాస్త సమయాన్ని ఆనందంగా గడుపుతారు.
మకరం:
వివాహం జరిగిన వారికి అత్తమామల నుంచి మంచి ఆర్ధిక లాభాలు కలుగుతాయి.అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యంగా తయారవుతారు.
కొంత కోపానికి గురయ్యి మనసును పాడు చేసుకుంటారు.మీరు కాస్త ధ్యానం చేస్తే మంచి జరిగే అవకాశం ఉంది.
కుంభం:
మీరు ఖర్చు పెట్టె డబ్బును చూసుకోండి.ఆర్ధికంగా నష్టపోకుండా జాగ్రత్తగా ఉండండి.
ఆపీసులోని మీకు వ్యతిరేకంగా ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు జరిగే కొన్ని సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తాయ్.
మీనం:
మీరు చేసుకున్న ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి.పేరు ప్రతిష్టలను పొందుతారు.
మీకు తెలిసిన మహిళల ద్వారా పని అవకాశాలు కలిగే అవకాశం ఉంది.సరైన పద్దతిలో విషయాలను అర్ధం చేసుకుంటే మంచిది.
లేదంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.