అయితే కొన్ని రోజుల్లో కొన్ని వస్తువులను కొని తేకూడదు.ఆలా తేవటం వలన కోరి సమస్యలను కొని తెచ్చుకున్నట్టే.
ముఖ్యంగా శనివారం రోజున కొన్ని వస్తువులను అసలు కొని ఇంటికి తేకూడదు.ఆలా చేస్తే సమస్యలు రావటమే కాకుండా దరిద్రం కూడా చుట్టుకుంటుంది.
ఇప్పుడు ఆ వస్తువులను తెలుసుకుంటే సమస్యల నుండి బయట పడే అవకాశం ఉంది.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
శనివారం నాడు ఉప్పు కొని ఇంటికి తెస్తే ఆ వ్యక్తి దౌర్భాగ్య స్థితిలో ఉంటాడు
శనివారం నాడు వంకాయ కొంటె దరిద్రం.అదే దానం చేస్తే చాలా మంచిది.
శనివారం నల్ల మిరియాలు కొంటే మన ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.
నల్ల నువ్వులను కొనటం వలన మనం అనుకున్న పనులు సజావుగా సాగక ఆటంకాలు వస్తాయి.
నల్లని బట్టలను కొని ఇంటికి తెస్తే కోరి దారిద్య్రాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే.
నల్లని చెప్పులు కొని వేసుకుంటే, ఆ చెప్పులు వేసుకొని ఏ పని చేసిన జరగదు.
శనివారం నాడు ఇనుము వస్తువులను కొంటె ఆర్ధికముగా నష్టపోతాం.అందుకే మన పెద్దవారు మోటార్ సైకిల్,కారు వంటివి శనివారం కొనవద్దని చెప్పుతూ ఉంటారు.
ఆవాలు కూడా దారిద్య్రాన్ని మోసుకువస్తుంది.అందువల్ల శనివారం అవాలును కొని ఇంటికి తేకూడదు.
చూసారుగా ఫ్రెండ్స్ ఈ వస్తువులను శనివారం కొని ఇంటికి తేకుండా జాగ్రత్త పదండి.