మన దేశంలో తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు.అందుకే ప్రతి రోజు పూజిస్తూ ఉంటారు.
క్రమం తప్పకుండా తులసి మొక్కను పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది ప్రజలు బలంగా నమ్ముతారు. తులసి మొక్క వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలిసిందే.
తులసి ఆకులను కేవలం పూజలో మాత్రమే కాకుండా ఎన్నో ఔషధాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
ఆయుర్వేద వైద్యంలో తులసిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
అంతేకాకుండా తులసి మొక్కలో లక్ష్మీదేవి, విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారని చాలామంది ప్రజలు నమ్ముతారు.అందుకే ఈ మొక్కను పూజిస్తే బాధలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు.
తులసి మొక్కను ఇంట్లో పెంచుతున్న వారు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి.

ఎందుకంటే తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు.కాబట్టి కొన్ని కొన్ని సమయాలలో నీళ్లు పోయకూడదు.అలాగే కొన్ని సమయాలలో తులసి మొక్కను అస్సలు తాగకూడదు.
అయితే తులసి ఆకులను కత్తిరించే సమయంలో ఈ విషయాలను కచ్చితంగా గుర్తుకు పెట్టుకోవాలి.అంతేకాకుండా శాస్త్రాల ప్రకారం ఈ తులసి మొక్కను రాత్రి లేదా సూర్యా స్తమయం లో తాకకూడదు.
ఇంకా చెప్పాలంటే తులసి మొక్కని రాత్రి సమయంలో తాగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

రాత్రిళ్ళు అలాగే సూర్యా స్తమయం అయిన తర్వాత తులసికి నీరు పోయకూడదు.ఇంకా చెప్పాలంటే ఆదివారం తులసి మొక్కను తాకకపోవడమే మంచిది.ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు పోకూడదు.
ఆ రోజున తులసి మాత ఉపవాసం ఉంటుంది.అలాగే ఇక ఏకాదశి రోజు కూడా తులసికి నీరు పోయకూడదు.
ఏకాదశి రోజున తులసి దేవి విష్ణువు కోసం నిర్వా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటుంది.ఆ రోజున నీళ్లు పెట్టడం వల్ల ఆమె ఉపవాసం భగ్నం అవుతుంది.
కాబట్టి ఈ నియమాలను కచ్చితంగా పాటించడం మంచిది.