మన దేశవ్యాప్తంగా భాషలతో కులమత బేధాలతో సంబంధం లేకుండా జరుపుకునే పండగలలో వినాయక చవితి( Vinayaka Chavithi ) ఒకటి.చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ పండుగలో పాల్గొని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
వీధి వీధికి ఒక వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిర్ణయించిన పూజలు( Puja ) చేస్తూ ఉంటారు.అయితే వీధిలో పెట్టే వినాయకులు మాత్రమే కాకుండా చాలామంది ఇంట్లో చిన్న చిన్న వినాయకుడి విగ్రహాలు పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు.
మరి ఇంట్లో వినాయకుడిని పెట్టి పూజించాలి అనుకునేవారు అందుకు ఎటువంటి నియమాలు పాటించాలి.పూజా విధానం ఏమి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సంవత్సరం సెప్టెంబర్ 19 2023లో వినాయక చవితి పండుగ వచ్చింది.మరి ఈ రోజున వినాయక విగ్రహానికి ఏ విధంగా పూజలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత పూజకు కావాల్సిన పూలు, పండ్లు( Fruits ) కొబ్బరికాయ, స్వామి వారి విగ్రహం అన్ని తెచ్చుకోవాలి.ముందుగా వినాయక పూజకు కావలసిన అన్ని సామాగ్రిని తెచ్చుకోవాలి.మట్టి గణపయ్య విగ్రహాన్ని కూడా ముందుగా తెచ్చిపెట్టుకోవాలి.
ఆ తర్వాత ముందుగా స్వామి వారి కోసం ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి.అలాగే మండపంపై వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

ఆ తర్వాత గణపతి పూజలు మొదలు పెట్టాలి.విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో దానికి సంబంధించిన శ్లోకాన్ని పాటించాల్సి ఉంటుంది.మూర్తి ప్రాణ ప్రతిష్ఠంతో చేసిన తర్వాత స్వామివారికి ముందు దీపారాధన చేయాలి.పండితులు ఈ మొత్తం పూజలు చేస్తుంటే గణేష్ కు నివాళి అర్పించే 16 రూపాయలు అర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి.
మనసులోని కోరికను కోరుకోవచ్చు.తర్వాత 21 రకాల పత్రి పూలతో స్వామివారినీ పూజించాలి.
ఎర్రటి కుంకుమను స్వామి వారి విగ్రహానికి పెట్టాలి.పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టాలి.
ఆ తర్వాత స్వామివారి వాహనమైన మూషికకు ధాన్యాలు పెట్టాలి.వినాయకుడి 108 శ్లోకాలు చదవడం మంచిది.
పూజ మొత్తం భక్తిశ్రద్ధలతో చేయాలి.