మన భారతదేశంలో ప్రజలు ప్రతి పండుగను కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.ఎందుకంటే మన దేశంలో జరుపుకునే ప్రతి పండుగకు ఒక రకమైన ప్రాముఖ్యత ఉంటుంది.
సనాతన ధర్మం ప్రకారం ప్రతి పండుగా రోజు కచ్చితంగా భగవంతుని పూజించి ప్రసాదం ఇస్తూ ఉంటారు.అంతే కాకుండా భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.
అంతే కాకుండా ఋతువుని బట్టి దేవునికి సమర్పించే నైవేద్యం మారుతూ ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే ఉగాది పండుగ( Ugadi festival )తో ఎండాకాలం మొదలవుతుంది.
ఉగాదికి షడ్రుచుల పచ్చడిని ఎలా అయితే స్వీకరిస్తామో ఆ తర్వాత వచ్చే శ్రీరామ నవమి( Sri Rama Navami ) రోజున రాములోరి కల్యాణం తర్వాత భక్తులకు వడపప్పు,పానకాన్ని ప్రసాదంగా పంచి పెడతారు.ఉగాది నుంచి వేసవి ఉడకా మొదలవుతుంది.
ఎండ కాలంలో వేడి పెరుగుతూ పోతుంది.అందుకే శ్రీరామ నవమికి తాటాకు పందిళ్ళను కూడా వేస్తారు.
అయితే పానకాన్ని ఎందుకు పంచడం వెనుక ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది.పనకంలో వేసే బెల్లం ( jaggery )శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.అందులోనే ఐరన్ కూడా ఉంటుంది.అలాగే మిరియాలు కఫాన్ని తగ్గిస్తాయి.అంతే కాకుండా శొంఠి వల్ల దగ్గు రాకుండా ఉంటుంది.శరీరంలోనీ వేడి సరైన స్థితిలో ఉంటుంది.
యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి.ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనది శ్రీరామనవమి రోజున రాములవారిని ముఖ్యంగా తులసి దళంతో పూజిస్తారు.
ఇంకా చెప్పాలంటే తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అలాగే వడపప్పు వడదెబ్బ నుంచి రక్షిస్తుంది.అంతే కాకుండా బుధ గ్రహానికి పెసరపప్పు ఎంతో ఇష్టమైనది.
అలా అని ప్రతి రోజు పనకాన్ని ఎవ్వరూ తాగరు.అందుకే వేసవి ఆరంభంలో రాముల వారి కళ్యాణం జరిగిన సందర్భంగా ప్రజలందరికీ పానకాన్ని పంచి పెడుతూ ఉంటారు.