మనదేశంలో పండుగలను ప్రజలు ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులందరితో పాటు జరుపుకుంటారు.కొన్ని పండుగలను మాత్రం ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకుంటూ ఉంటారు.
పండుగ ఇంకా కొన్ని రోజులు ఉంది అనగానే వారి ఇంటిని పరిశుభ్రంగా చేసి,ఇంటి అలంకరణకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు.అలాగే ఇంట్లో ఉండే అనేక వస్తువులను సరిగ్గా ఉపయోగించినట్లయితే ఆ ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీని తొలగించవచ్చు.
దీనివల్ల ఆ కుటుంబ సభ్యులందరికీ ఆనందం శ్రేయస్సు లభిస్తాయి.
వాస్తు శాస్త్రంలో పటికకు అనేక ఇంటి దోషాల నివారణలు ఉన్నాయి.
పటిక చాలా పవిత్రమైనది కాబట్టి సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అలాగే, పటిక కూడా అనేక రకాల లోపాలను తొలగించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
శుభ్రమైన ఎర్రటి గుడ్డలో పటికను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల వాస్తు దోషాలు,నరదృష్టి తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉన్న వారు సుఖ సంతోషాలతో ఉంటారు.ఇంటి గుమ్మం ముందు పటికను కట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు వచ్చే అవకాశం లేదు.నరక చతుర్దశి, కాళీ చౌదస్ రోజు పటికతో కొన్ని నివారణలు చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువచ్చే అవకాశం ఉంది.
ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఒక ఎర్రటి పరిశుభ్రమైన గుడ్డలో చిన్న పట్టిక ముక్కను చుట్టి భద్రంగా ఉంచాలి.ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఖర్చులు కూడా తగ్గుతాయి.
కొన్ని ఇండ్లలో నెగిటివ్ ఎనర్జీ ఉందని నమ్మేవారు ఒక నల్లని శుభ్రమైన గుడ్డలు పటిక ముక్కను కట్టి ఇంటి ముఖ ద్వారా తలుపులకు వేలాడదీయడం మంచిది.నరక చతుర్దశి రోజున ఇంటి శుభ్రంగా అలంకరించడంతోపాటు, ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులంతా ఆ రోజూ ఉదయం పటిక నీటితో స్నానం చేయాలి.
ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.