సంస్కారం అంటే ఇదే కదా... ఫోటోగ్రాఫర్లకు నమస్కారం చేసిన స్టార్ కిడ్స్!

సాధారణంగా సినిమా సెలబ్రిటీలపై ఫోటోగ్రాఫర్లు ఎంతో ఫోకస్ చేసి ఉంటారు వారి గురించి తెలుసుకోవడానికి కొన్నిసార్లు ఫోటోగ్రాఫర్లు హద్దు మీరి ప్రవర్తిస్తూ ఉండగా సెలబ్రిటీలు వారి ప్రవర్తన పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉంటారు.అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం మీడియాకు ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు.

 Isn't This What Culture Is All About Star Kids Who Saluted The Photographers ,p-TeluguStop.com

ఇకపోతే ఇతర దేశాలకు తరచూ ప్రయాణాలు చేసే సెలబ్రిటీల కోసం ఎయిర్పోర్ట్ వద్ద ఫోటోగ్రాఫర్లు పడిగాపులు కాస్తూ ఉంటారని సంగతి మనకు తెలిసిందే.అయితే కొందరు సెలబ్రెటీలు మాత్రం ఫోటోగ్రాఫర్లను చూసి చూడనట్టు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రిషితేష్ దేశ్ ముఖ్ జెనీలియా దంపతులు ఎయిర్ పోర్టులో సందడి చేశారు.ఈ క్రమంలోనే ఫోటోగ్రాఫర్లు ఒక్కసారిగా తమ కెమెరాలు అన్నింటిని వారి వైపు మళ్ళించాయి.అయితే జెనీలియా కుమారులు ఇద్దరు ఫోటోగ్రాఫర్లను చూడగానే ఏకంగా రెండు చేతులు జోడించి వారికి నమస్కారం పెట్టారు.అదేవిధంగా జెనీలియా దంపతులు సైతం ఫోటోగ్రాఫర్లకు రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసినటువంటి ఎంతో మందిని స్టార్ కిడ్స్ ని చూసి తెగ ముచ్చట పడుతున్నారు.సంస్కారం అంటే ఇదే కదా అంటూ ఈ చిన్నారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.స్టార్ కిడ్స్ ఆయనప్పటికీ ఏమాత్రం అహంకారం లేకుండా ఇంత చిన్న వయసులోనే ఎంతో వినయంగా ఫోటోగ్రాఫర్లకు నమస్కారం చేయడంతో వీరి సంస్కారానికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube