టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.ఆయన నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాయి.
కాగా సంపూర్ణేష్ బాబు నటించిన లాస్ట్ మూవీ కొబ్బరిమట్ట బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తరువాత సంపూ ఇప్పటివరకు తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేయలేదు.
అయితే తాజాగా సంపూ ఓ ఆసక్తికర కథను విన్నాడని, దాన్ని ఓకే చేసేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది.కాగా ఈ కథ కరోనా వైరస్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో సంపూ కరోనాపై చేసే యుద్ధం ఓ రేంజ్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.సాధారణంగా సంపూ చేసే స్పూఫ్ చిత్రాలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
మరి ఇప్పుడు కరోనా వైరస్‌తో సంపూ ఎలా ఢీల్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమాలో కరోనాతో వార్ చేసే క్రమంలో సంపూ పండించే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయం అంటున్నారు చిత్ర యూనిట్.
ఒక కొత్త డైరెక్టర్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సంపూర్ణేష్ బాబు రెడీ అవుతున్నాడు.ఇక గతంలో కొబ్బరిమట్ట చిత్రంతో అదిరిపోయే కామెడీని పండించిన ఈ హీరో, ఇప్పుడు కరోనాను ఎలా ఖతం చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
మరి ఈ సినిమాలో సంపూ అరాచకం ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా మొదలై, రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.