ఈ సంవత్సరంలోనే మళ్లీ ముక్కోటి ఏకాదశి.. డిసెంబర్ నెలలో ఎప్పుడంటే..?

మనకు సంవత్సరం లోని 365 రోజులు దేవతలకు ఒక్క రోజుతో సమానం అని చాలా మందికి తెలియదు.అందుకే మన ఆరు నెలలు దేవతలకు పగులు, మరో ఆరు నెలలు రాత్రి ఉంటుంది.

 In This Year Again 3rd Ekadashi When In The Month Of December , Vaikuntha Ekadas-TeluguStop.com

అంటే దక్షిణ యానం అంతా దేవతలకు రాత్రి, ఉత్తరాయణం పగలుగా చెబుతూ ఉంటారు.ఈ లెక్కల ప్రకారం వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadashi )రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసిపోతుందని పండితులు చెబుతున్నారు.

శ్రీమహావిష్ణువుని( Lord Vishnu ) నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు త్వరగా ద్వారాలు తెరిచే రోజు అని కూడా చెబుతున్నారు.అలాగే స్వర్గద్వారాలు తెరిచే రోజు అని కూడా చెబుతారు.

ఇందుకు సూచనగా వైష్ణవ దేవాలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.

Telugu Bhakti, Devotional, Ekadashini, Lord Vishnu-Latest News - Telugu

ఈ ద్వారం గుండా లోపల కు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు దూరమై పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తులు నమ్ముతారు.ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినీ( Ekadashini ) ఉత్తర ద్వారా దర్శన ఏకాదశి అని పిలుస్తారు.

ఈ రోజున ప్రతి ఆలయంలో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు.ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని మోక్షదాయకమే అని వేద పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే డిసెంబర్ 22వ తేదీన శుక్రవారం రోజు దశమి ఉదయం 9:30 నిమిషముల వరకు ఉంటుంది.ఆ తర్వాత నుంచి ఏకాదశి మొదలవుతుంది.

డిసెంబర్ 23 శనివారం రోజు ఉదయం ఏడు గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే సూర్యోదయానికి తిథి పరిగణలోకి తీసుకోవాలి.

Telugu Bhakti, Devotional, Ekadashini, Lord Vishnu-Latest News - Telugu

కాబట్టి ముక్కోటి ఏకాదశి( Mukkoti Ekadashi ) డిసెంబర్ 23 శనివారం రోజు వచ్చిందని పండితులు చెబుతున్నారు.ఈ రోజు తెల్లవారుజామున నుంచే వైష్ణవ దేవాలయాలలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది.అయితే ఏకాదశి ఘడియలు దాటకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.లేదంటే డిసెంబర్ 22 వ తేదీన శుక్రవారం సాయంత్రానికి ఏకాదశి తిధి ఉంది.

కాబట్టి కొన్ని దేవాలయాల్లో సాయంత్రం సమయంలో ఉత్తర ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తారు.అంటే డిసెంబర్ 22 వ తేదీన శుక్రవారం సాయంత్రం నుంచి డిసెంబర్ 23 శనివారం ఉదయం 8 గంటలలోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube