అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. జార్జియాలో బస్సు యాత్ర ప్రారంభించిన హారిస్- వాల్జ్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్,( Kamala Harris ) రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) ప్రచారాన్ని పరుగులు తీయిస్తున్నారు.

ఇప్పటికే నల్లజాతి, దక్షిణాసియా, భారత సంతతి కమ్యూనిటీల మద్ధతు కమలా హారిస్‌కు లభిస్తోంది.

ఓపీనియన్ పోల్స్, ముందస్తు సర్వేల్లోనూ ఆమె దూసుకెళ్తున్నారు.దీనిని ఇలాగే కంటిన్యూ చేస్తూ .

ట్రంప్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని కమలా హారిస్ పావులు కదుపుతున్నారు. """/" / దీనిలో భాగంగా తన రన్నింగ్‌మెట్, మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌తో( Tim Walz ) కలిసి జార్జియాలో బుధవారం బస్సు యాత్రను( Bus Tour ) ప్రారంభించారు.

ఇది రెండు రోజుల పాటు జరుగుతుందని హారిస్ - వాల్జ్ ప్రచార బృందం తెలిపింది.

జార్జియా( Georgia ) దక్షిణ ప్రాంతంలోని రూరల్ ఏరియాల మీదుగా ఇది సాగుతుందని వెల్లడించింది.

తీర ప్రాంత పట్టణం సవన్నాలో అతిపెద్ద ర్యాలీ నిర్వహించారు. """/" / డెమొక్రాటిక్ పార్టీ మద్ధతుదారులు, ప్రచార సిబ్బంది, చిన్న వ్యాపార యజమానులు, ఓటర్లతో ఈ యాత్రలో మమేకం కానున్నారు.

నవంబర్‌లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించాలంటే 2020లో జో బైడెన్( Joe Biden ) వైపు నిలబడిన అట్లాంటాతో పాటు రిపబ్లికన్ల కంచుకోటల్లోకి కూడా ప్రవేశించాలని కమలా హారిస్ ప్రచార బృందం భావిస్తోంది.

ఈ ఏడు రాష్ట్రాల ట్రిప్ అనేది డెమొక్రాట్లు ఎప్పుడో ప్రారంభించాలని అనుకున్నారు.అయితే డెబ్బీ సైక్లోన్ ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయడంతో నార్త్ కరోలినా, జార్జియా ట్రిప్‌లను వారు రద్దు చేసుకున్నారు.

తాజా యాత్రలో వాల్జ్ సవన్నాలోని టార్మాక్‌ వద్ద కమలా హారిస్‌ను కలుసుకుని సవన్నా స్టేట్ యూనివర్సిటీ విద్యార్ధులను పలకరించారు.

యూఎస్ సీక్రెట్ సర్వీస్‌కు చెందిన బస్సులో హారిస్ - వాల్జ్‌లు బయల్దేరారు.దీనిపై ‘‘ ఏ న్యూ వే ’’ అనే అక్షరాలను రాశారు.

గురువారం ర్యాలీతో పాటు హారిస్, వాల్జ్‌లు ఉమ్మడిగా సీఎన్ఎన్ యాంకర్ డానా బాష్‌కు ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

ఇది ఇవాళ రాత్రి ప్రసారం కానుంది.

డబ్బులు ఎక్కువై ఈ సినిమాలు తీశారా.. వాటిని చూస్తే మతిపోతుంది..?