బైండోవర్ అయిన ముగ్గురు వ్యక్తులకు జరిమానా విధింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet ) బొప్పాపూర్ గ్రామానికి చెందిన చెందిన అనరాసి కిష్టయ్య s/o దాదయ్య (45) బేడ బుడగ జంగం అనునతడు ఇనుప సామాన్ దుకాణం నడుపుకుంటూ ఉండేవాడు.దొంగిలించిన ఇనుప సామన్ విక్రయించవద్దని గతంలో ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో ముందు బైండోవర్ చేసినప్పటికీ మారకుండా బైండోవర్ అతిక్రమించి దొంగ సొత్తు కొనగా అతనిపై ఎల్లారెడ్డిపేట పోలిస్ స్టేషన్( Yellareddypet police station ) లో ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేయగా దీనిపై ఎమ్మార్వో 25వేల రూపాయలు జరిమాన విధించినాడు.

 Penalty Imposed On Three Persons Who Were Bindovers, Yellareddypet ,rajanna Sir-TeluguStop.com

మందాటి సంతోష్ s/o ఆశయ, (40) గొల్ల,r/o అక్కపల్లి గ్రామం, బొమ్మనవేని పరుశరాములు s/o నర్సయ్య , 54సం, ముదిరాజ్,r/o బొప్పాపూర్ లు ఎలాంటి అనుమతులు లేకుండా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారని ఎమ్మార్వో ముందు బైండోవర్ చేసినప్పటికీ మారకుండా అదే విధంగా బెల్ట్ షాప్ నిర్వహించి బైండోవర్ అతిక్రమించగా వారిద్దరికీ కూడా ఎమ్మార్వో మాందాటి సంతోష్ కి పదివేల రూపాయలు, బొమ్మన వేని పరశురాములు కి 25వేల రూపాయలు జరిమానా విధించినాడు.

ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతి భద్రత లకు విఘాతం కలిగించే వ్యక్తులను ముందస్తు గా బైండోవర్ చేయటం జరుగుతుంది అని, బైండోవర్ నందు తహసీల్దార్ నిర్దేశించిన గడువు లోగా ఏదైనా కేసు వారి మీద అయినట్టు జరిగితే బైండ్ డౌన్ చేయటం జరుగుతుంది.

దీని ప్రకారం అట్టి వ్యక్తుల కు షూరిటీ మొత్తం లేదా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఏదైనా చట్ట పరమైన సమస్య ఉంటే పోలీస్ వారిని సంప్రదించాలి కానీ చట్ట వ్యతిరేకం గా వ్యవహరించకూడదు అని సిఐ శ్రీనివాస్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube