తండ్రి హమాలీ.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కొడుకులు, కూతురు.. వీళ్ల సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

చదువును ఆయుధంగా మలచుకుంటే ఆలస్యంగానైనా కెరీర్ పరంగా కోరుకున్న సక్సెస్ దక్కుతుందనే సంగతి తెలిసిందే.పేదరికం చదువుకు అడ్డు కాదని ఇప్పటికే ఎంతోమంది ప్రూవ్ చేశారు.

 Husnabad Family Members Got Three Government Jobs Details, Husnabad , Three Gove-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రంలోని హుస్నాబాద్ కు( Husnabad ) చెందిన చేర్యాల మైసయ్య( Cheryala Maisayya ) హమాలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు.తండ్రి కష్టాన్ని చూసి సంతానం రాజ్ కుమార్, శ్వేత, శ్రీకాంత్ ఎంతో కష్టపడి చదివారు.

పెద్ద కొడుకు రాజ్ కుమార్( Raj Kumar ) అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక కాగా కూతురు శ్వేత( Swetha ) గ్రామ పంచాయితీ కార్యదర్శిగా పని చేస్తున్నారు.చిన్న కొడుకు శ్రీకాంత్ కు( Srikanth ) నెల రోజుల క్రితం ఫైర్ స్టేషన్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది.

తాను ఎంత కష్టపడినా తన పిల్లలు మాత్రం ఉన్నత స్థాయిలో ఉండాలని మైసయ్య భావించారు.తండ్రి నమ్మకాన్ని నిజం చేస్తూ ముగ్గురు బిడ్డలు మంచి ఉద్యోగాలు సాధించారు.

Telugu Job, Grampanchayat, Hamali, Husnabad, Raj Kumar, Srikanth, Swetha, Jobs-I

చిన్నచిన్న అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ రాజ్ కుమార్, శ్వేత, శ్రీకాంత్ సత్తా చాటారు.తండ్రి కోరికను నెరవేర్చి ముగ్గురు బిడ్డలు ఎంతోమందిలో స్పూర్తి నింపుతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడంతో తండ్రి కష్టాలు తీరినట్టేనని నెటిజన్లు భావిస్తున్నారు.వీళ్లు కెరీర్ పరంగా ఎదగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Job, Grampanchayat, Hamali, Husnabad, Raj Kumar, Srikanth, Swetha, Jobs-I

ప్రతిభ ఉంటే పేద విద్యార్థులు సైతం సులువుగా సత్తా చాటగలుగుతారని వీళ్లు ప్రూవ్ చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.వీళ్ల సక్సెస్ స్టోరీని ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ప్రభుత్వ ఉద్యోగాలపై ఫోకస్ పెడితే లాంగ్ టర్మ్ లో అయినా లక్ష్యాలను సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.కష్టపడితే పేదరికం చదువుకు ఎప్పటికీ అడ్డు అయితే కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube