వివాదానికి చెక్ పెట్టిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తానంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ పాయల్ రాజపుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కాగా ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ఆర్ఎక్స్ 100.

 Payal Rajput Ready Settlement Rakshana Movie Team, Payal Rajput, Tollywood, Raks-TeluguStop.com

అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో సంచలనం సృష్టించాయి.

ఆర్ఎక్స్ 100తో పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ కెరీర్ మారిపోయింది.

తెలుగులో ఒక్కసారిగా హాట్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

Telugu Payal Rajput, Rakshana, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా పాయల్‌ రాజ్‌పుత్‌ ( Payal Rajput )సోషల్‌ మీడియాలో చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి.తను నటించిన రక్షణ సినిమా( Rakshana movie ) టీమ్‌పై ఆమె సంచలన ఆరోపణ చేసింది.నాలుగేళ్ల క్రితం నిర్మించిన సినిమాను ఇప్పుడు విడుదల చేస్తున్నారని చెప్పిన పాయల్ ఆ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్‌( Remuneration ) లో కొంత తనకు చెల్లించాల్సి ఉంది అని తెలిపింది.

అయితే, తనకు ఇవ్వాల్సిన బకాయిలు పక్కన పెట్టి సినిమాను విడుదల చేయడాన్ని ఆమె తప్పు బట్టింది.అగ్రిమెంట్‌ ప్రకారం తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్‌ ను చెల్లించకుండానే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె తెలిపింది.

Telugu Payal Rajput, Rakshana, Tollywood-Movie

అలా చేయకుంటే తెలుగు పరిశ్రమ నుంచి తనను బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది.అయితే పాయల్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ విషయంపై చిత్ర యూనిట్‌ కూడా స్పందించింది.ప్రమోషన్స్‌ కు వస్తే పాయల్‌కు చెల్లించాల్సిన రూ.6 లక్షలు ఇచ్చేందుకు నిర్మాత సిద్ధమయ్యారని కానీ పాయల్ పట్టించుకోలేదని వారు వెల్లడించారు.ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.  తాజాగా పాయల్ రాజ్‌పుత్‌ మరోసారి తన సోషల్‌ మీడియాలో ఒక నోట్‌ రాసింది.

నేను డైరెక్టర్‌, నిర్మాతకు చాలా గౌరవం ఇస్తాను.నా ఉద్దేశం వారిని బాధపెట్టాలని లేదు.నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సినిమా విడుదల చేయాలనుకోవడం బాధ అనిపిస్తుంది.2020 నుంచి ఇప్పటికీ కూడా రక్షణ టీమ్‌ కు నేను సపోర్ట్‌ చేస్తున్నాను.ప్రేక్షకులను మెప్పించేందుకు దర్శకుడు, నిర్మాతల టీమ్‌ ఎంత కష్టపడుతారో నాకు తెలుసు.కాబట్టి వారిని నష్టపెట్టాలని నేను ఎప్పుడూ కోరుకోను.నేను అడిగింది ఒక్కటే నాకు చెప్పకుండా సినిమాను విడుదల చేయడం బాధ అనిపించింది.ఇదీ నా రిక్వెస్ట్‌.

నేను ఎవరికీ అపకారం చేయను అని ఆమె తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube