నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోరు హోరా హోరీగా జరిగింది .వైసిపి 175 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేయగా , టిడిపి, జనసేన బిజెపిలు ఆ సీట్లను సర్దుబాటు చేసుకుని మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి.
ఈ పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను పోటీకి దించింది .ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తాము గెలుచుకుంటామనే ధీమా జనసేన పార్టీ ( Jana Sena Party )ఉంది.గతంలో మాదిరిగా పూర్తిగా కొత్త వాళ్లకు టికెట్ల ను కేటాయించకుండా, ఇతర పార్టీల నుంచి జనసేనలో చేరిన బలమైన నేతలకు టికెట్లు కేటాయించారు.రాజకీయంగా అనుభవం ఉన్న వారి ఎక్కువమంది కావడంతో గెలుపు పై జనసేన భారీగానే ఆశలు పెట్టుకుంది.
జనసేన వర్గాల లెక్కల ప్రకారం చూసుకుంటే కనీసం 21 లో 17 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాము అని, లోక్ సభ తాము పోటీ చేసిన కాకినాడ మచిలీపట్నం లోక్ సభ కు పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధిస్తామని జనసేన పార్టీ అంచనాతో ఉంది.
కాకపోతే అసెంబ్లీ సీట్ల విషయంలోనే ఎక్కువ టెన్షన్ పడుతోంది.ముఖ్యంగా పోలవరం, పాలకొండ రైల్వేకోడూరు స్థానాల్లో గెలుపు కష్టమనే అభిప్రాయా,నికి వచ్చినట్లు సమాచారం.దీంతోపాటు నెల్లిమర్ల నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన లోకం మాధవితో పాటు , ఎన్నికలకు ముందు జనసేన నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ,అలాగే తిరుపతిలో పోటీ చేసిన ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
రాజోలు ,రాజానగరం, పి గన్నవరం నియోజకవర్గంలో సైతం వైసీపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో తప్పకుండా విజయం తమదే అన్న ధీమా జనసేన వర్గాల్లో కనిపిస్తోంది .
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి .పవన్ భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా జనసేన పార్టీ కీలక నేతలే అంచనా వేస్తున్నారు.పిఠాపురం ఎఫెక్ట్ తో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ( Tangella Uday Srinivas )కూడా విజయం సాధిస్తారని , ఇక మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగిన బాల శౌరి కూడా విజయం సాధిస్తారని జనసేన ధీమాతో ఉంది.