ఏపీలో పీకే ' పాలిటిక్స్ ' .. వైసిపి పై విమర్శలు వ్యూహాత్మకమా ? 

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు( Prashant Kishor ) దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న సంగతి తెలిసిందే.రాజకీయ పార్టీలకు వ్యహకర్తగా ఆయన పనిచేస్తూ, తాను పనిచేసిన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా చేయడం లో ప్రశాంత్ కిషోర్ దిట్ట.తనకు చెందిన ఐ ప్యాక్ టీం ద్వారా ఈ రాజకీయ వ్యూహాలను అందిస్తూ ఉంటారు.2019 ఎన్నికలలో వైసీపీ( YCP ) కోసం ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలను అందించారు.టిడిపి పై వ్యతిరేకత , ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు పనిచేయడంతో , 151 సీట్లతో వైసిపి తిరుగులేని అధికారాన్ని దక్కించుకుంది .అయితే ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా ఐ ప్యాక్ కు దూరమై ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.

 Political Strategy Behind Prashant Kishor Comments On Ycp Details, Prasanth Kish-TeluguStop.com
Telugu Ap, Ap Cm Jagan, Ipac, Janasena, Strategy, Prasanth Kishor, Prashant Kish

ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త సేవలకు దూరంగానే ఉన్నా.ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం ( I-Pac ) మాత్రం 2024 ఎన్నికల్లో వైసీపీ కోసమే పనిచేసింది.ఇక ఎన్నికలకు ముందు నుంచి,  ఆ తరువాత ఏపీలో వైసీపీకి ఓటమి తప్పదు అంటూ ప్రశాంత్ కిషోర్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.సందర్భం వచ్చినప్పుడల్లా ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ వస్తున్న ప్రశాంత్ కిషోర్,  ఏపీలో జగన్( Jagan ) మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమని చెబుతున్నారు.

  తాజాగా సీనియర్ జర్నలిస్ట్ బర్కదత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం జరగదని,  ప్రజల్లో ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని , మళ్ళీ వైసీపీ అధికారంలోకి ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఛాన్స్ లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పడం సంచలనంగా మారింది.

Telugu Ap, Ap Cm Jagan, Ipac, Janasena, Strategy, Prasanth Kishor, Prashant Kish

ఆయన వ్యాఖ్యలపై వైసిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ దేని ప్రతిపదికన ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపైన ఆరా తీస్తోంది.ఇక పీకే వ్యాఖ్యలు కూటమిలోని టిడిపి,  జనసేన, బిజెపిలలో( TDP Janasena BJP ) ఉత్సవం పెంచేలా చేశాయి.

అయితే ప్రశాంత్ కిషోర్ ఏ ఆధారంతో ఏపీ లో వైసిపి అధికారంలోకి రాదు అని చెబుతున్నారు అనేది అందరికీ ప్రశ్న గానే మారింది.ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం ఈ ఎన్నికల్లో వైసిపి కోసం పనిచేయడంతో,  వారే ప్రశాంత్ కిషోర్ కు దీనిపై నివేదిక ఇచ్చారా ?  అందుకే ఇంత ధైర్యంగా ప్రశాంత్ కిషోర్ వైసిపి అధికారంలోకి రాదని చెబుతున్నారా అనే అనుమానాలు వైసిపి నేతల్లోనూ కలుగుతున్నాయి.అయితే దేశంలో మోడీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని , కానీ ఆగ్రహం లేదని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారని,  మరి అటువంటి అప్పుడు ఏపీలో జగన్ పాలనపై ఆగ్రహం ఉందని ఏ విధంగా పీకే చెబుతున్నారని వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube