ఏపీలో పీకే ‘ పాలిటిక్స్ ‘ .. వైసిపి పై విమర్శలు వ్యూహాత్మకమా ? 

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు( Prashant Kishor ) దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న సంగతి తెలిసిందే.

రాజకీయ పార్టీలకు వ్యహకర్తగా ఆయన పనిచేస్తూ, తాను పనిచేసిన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా చేయడం లో ప్రశాంత్ కిషోర్ దిట్ట.

తనకు చెందిన ఐ ప్యాక్ టీం ద్వారా ఈ రాజకీయ వ్యూహాలను అందిస్తూ ఉంటారు.

2019 ఎన్నికలలో వైసీపీ( YCP ) కోసం ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలను అందించారు.

టిడిపి పై వ్యతిరేకత , ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు పనిచేయడంతో , 151 సీట్లతో వైసిపి తిరుగులేని అధికారాన్ని దక్కించుకుంది .

అయితే ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా ఐ ప్యాక్ కు దూరమై ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.

"""/" / ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త సేవలకు దూరంగానే ఉన్నా.ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం ( I-Pac ) మాత్రం 2024 ఎన్నికల్లో వైసీపీ కోసమే పనిచేసింది.

ఇక ఎన్నికలకు ముందు నుంచి,  ఆ తరువాత ఏపీలో వైసీపీకి ఓటమి తప్పదు అంటూ ప్రశాంత్ కిషోర్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

సందర్భం వచ్చినప్పుడల్లా ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ వస్తున్న ప్రశాంత్ కిషోర్,  ఏపీలో జగన్( Jagan ) మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమని చెబుతున్నారు.

  తాజాగా సీనియర్ జర్నలిస్ట్ బర్కదత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం జరగదని,  ప్రజల్లో ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని , మళ్ళీ వైసీపీ అధికారంలోకి ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఛాన్స్ లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పడం సంచలనంగా మారింది.

"""/" / ఆయన వ్యాఖ్యలపై వైసిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ దేని ప్రతిపదికన ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపైన ఆరా తీస్తోంది.

ఇక పీకే వ్యాఖ్యలు కూటమిలోని టిడిపి,  జనసేన, బిజెపిలలో( TDP Janasena BJP ) ఉత్సవం పెంచేలా చేశాయి.

అయితే ప్రశాంత్ కిషోర్ ఏ ఆధారంతో ఏపీ లో వైసిపి అధికారంలోకి రాదు అని చెబుతున్నారు అనేది అందరికీ ప్రశ్న గానే మారింది.

ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం ఈ ఎన్నికల్లో వైసిపి కోసం పనిచేయడంతో,  వారే ప్రశాంత్ కిషోర్ కు దీనిపై నివేదిక ఇచ్చారా ?  అందుకే ఇంత ధైర్యంగా ప్రశాంత్ కిషోర్ వైసిపి అధికారంలోకి రాదని చెబుతున్నారా అనే అనుమానాలు వైసిపి నేతల్లోనూ కలుగుతున్నాయి.

అయితే దేశంలో మోడీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని , కానీ ఆగ్రహం లేదని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారని,  మరి అటువంటి అప్పుడు ఏపీలో జగన్ పాలనపై ఆగ్రహం ఉందని ఏ విధంగా పీకే చెబుతున్నారని వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

మరోసారి సీనియర్ కొరియోగ్రాఫర్లకే అవకాశం ఇస్తున్న చిరంజీవి…