మళ్లీ రేవ్ పార్టీ రగడ..అంతా మూణ్ణాళ్ల ముచ్చట..బిక్కుబిక్కుమంటున్న తారలు

ఎన్నికల రిజల్ట్స్ వచ్చేవరకు న్యూస్ పెద్దగా దొరకదనుకుంటున్న పలు మీడియా చానళ్లకు ఇపుడు బెంగుళూరు రేవు పార్టీ( Bengaluru Rave Party ) రగడ కొంత బూస్ట్ ఇచ్చినట్టు అయింది.ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా మీడియాలో ఒకటే న్యూస్ రన్ అవుతోంది.

 News About Bangalore Rave Party Issue Details, Bangalore Rave Party , Tollywood-TeluguStop.com

అదే బెంగుళూరు రేవు పార్టీ కహానీ.హైదరాబాద్ కి చెందిన ఓ బడా వ్యాపారి అయినటువంటి వాసు ( Vasu ) దానిని నిర్వహించినట్టు సమాచారం.

అన్ని హంగులు, ఆర్భాటాలతో మొదలైన పార్టీలో మన టాలీవుడ్ భామలు లేకపోతే ఎలా? దానికి చాలా మంది టీవీ, సినిమా నటీనటులు, రాజకీయ పార్టీల నాయకులు అనేకమంది హాజరు కావడం జరిగింది.

Telugu Srikanth, Actress Hema, Bangalore Rave, Bengaluru, Vasu, Drugs, Navadeep,

అక్కడే వచ్చింది చిక్కు.కెమెరాలన్నీ మనోళ్లవైపే కదా ఉండేది? దాంతో బెంగుళూరు శివారులోని బీఆర్ ఫామ్ హౌజు (ఓనర్ గోపాలరెడ్డి అట)లో జరిగిన రేవ్ పార్టీని బెంగుళూరు నార్కొటిక్ పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే “అబ్బే, మేమక్కడ లేనేలేం!” అని మాజీ హీరో శ్రీకాంత్,( Hero Srikanth ) ఒకప్పటి నటి హేమ( Hema ) ఖండినప్పటికీ నిప్పు లేనిదే పొగ రాదుకదా అంటూ నెటిజనం ప్రశ్నిస్తున్నారు.

అవును, అంతమందిలో మీరిద్దరి పేర్లు మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నాయి? అని అనుమానంగా అడిగే వారు లేకపోలేదు.అక్కడ దొరికిన వాళ్లను దొరికినట్టు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఈ క్రమంలో కొంతమేరకు డ్రగ్స్ , కార్లను సీజ్ చేశారు.

Telugu Srikanth, Actress Hema, Bangalore Rave, Bengaluru, Vasu, Drugs, Navadeep,

ఎంతమందిని అరెస్ట్ చేసినా సినిమా ఆర్టిస్టులను పట్టేసున్నట్టే పట్టుకొని మరలా వదిలేయడం కాస్త చోద్యంగా ఉందని ఇపుడు కొందరు ఆరా తీస్తున్నారు.అంత గోప్యంగా బతికేవారు ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయడం దేనికని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.అయితే మనకి ఇలాంటి డ్రగ్స్, రేవు పార్టీలు కొత్తేమీ కావు.

గతంలో కూడా టాలీవుడ్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అందరికీ తెలిసినదే.డ్రగ్స్ పెడిలింగ్( Drug Peddling ) నేరం, అంతే తప్ప, మరీ స్వల్ప మోతాదుతో దొరికినా, సేవించినా నేరం కాదన్నట్టుగా ప్రభుత్వమే వదిలేయడం కాస్త కామెడీనే అని కొంతమంది గుసగుసలాడుకుంటున్న పరిస్థితి.

Telugu Srikanth, Actress Hema, Bangalore Rave, Bengaluru, Vasu, Drugs, Navadeep,

ఆ మధ్య ఏదో పబ్బులో అర్ధరాత్రి దాటాక దాడులు చేసి, అందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోగా అందులో నాగబాబు బిడ్డ( Nagababu Daughter ) కూడా దొరికినట్టు గుసగుసలు వినబడ్డాయి.అదేవిధంగా హీరో రవితేజ నుండి హీరో నవదీప్ వరకూ అందరూ ఇటువంటి సంఘటనల బాధితులే.ఈ క్రమంలోనే ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినబడుతున్నాయి.తాము చేస్తున్నది తప్పు అని తెలిసినపుడు చేయడం దేనికి? ఒకవేళ తాము చేస్తున్నది ఒప్పు అని తమకి అనిపించినపుడు దాక్కోవడం దేనికి? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.దీనికి మీకు సమాధానం తెలిస్తే ఇక్కడ కామెంట్స్ చేయండి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube