పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించినప్పుడే నిజమైన బతుకమ్మ సంబరాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యశోద అన్నారు.మంగళవారం మోటకొండూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలందించాలని అన్నారు.
ఈ సందర్బంగా 25 మంది ఆశా కార్యకర్తలకు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ రామకృష్ణ, డిప్యూటి డియం అండ్ హెచ్ ఓ శిల్పని,డిపి హెచ్ ఎన్ఓ సత్యవతి,ఎల్త్ ఎడ్యూకేటర్ క్రిష్ణ,డాక్టర్ విజయ్,ఎం.
ఎల్.హెచ్.పిలు డాక్టర్ శివాని,హారిక, పార్వతమ్మ,హెచ్ఈఓ నరసింహ,హెల్త్ సూపర్వైజర్లు సుగుణ, అంజుమ్,ఆరోగ్య కార్యకర్తలు సుభాషిని పద్మావతి,నిర్మల,అరుణ ధన,విజయరాణి,స్టాఫ్ నర్స్ రజిత,ఫార్మసిస్ట్ మమత,హెల్త్ అసిస్టెంట్స్ సైదులు,అంజయ్య, ల్యాబ్ టెక్నీషియన్ సురేష్,ఎల్ డి కంప్యూటర్ సందీప్,ఆయా జయమ్మ, అన్ని గ్రామాల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.