వేసవికాలంలో చెమట వలన వచ్చే పొక్కులు, దురద తగ్గడానికి నివారణలు ఇవే..!

వేసవికాలం( Summer ) వచ్చిందంటే చాలు చర్మంపై దురద( Rashes ) కారణంగా చాలా సమస్యలు వస్తాయి.చిన్న ఎర్రటి మచ్చలు, దద్దర్లు కనిపిస్తూ ఉంటాయి.

 Summer Sweat Blisters Itchy Rashes Reducing Tips Details, Summer Sweat , Itchy R-TeluguStop.com

అంతేకాకుండా ఒళ్లంతా మండిపోతూ ఉంటుంది.అయితే చెమట పట్టడం వలన ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.

అంతేకాకుండా చెమట ( Sweat ) వలన ఇన్ఫెక్షన్ కారణంగా కూడా వస్తుంది.ఇక శరీరంలో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.

వేడి వలన దద్దుర్లు, దురద, శరీరం పై పొక్కులు రావడానికి ప్రధాన కారణం.

సూర్య రష్మి సరిగ్గా తగలకపోవడం, టైట్ గా ఉండే డ్రస్సులు వేసుకోవడం, మేకప్ ఎక్కువగా వేసుకోవడం వలన శరీరంలో హీట్ పెరిగి ఒళ్లంతా దురద, దద్దుర్లు వస్తాయి.

అయితే వీటిని నివారించడానికి ఇంట్లోనే చక్కటి చిట్కాలను పాటించి దూరం చేసుకోవచ్చు.ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.హీట్ వల్ల కలిగే దద్దుర్లను నివారించడానికి కొన్ని రకాల సహజ నివారణలు ఉన్నాయి.ముఖ్యంగా కాటన్ వదులుగా ఉండే డ్రస్సులు వేసుకోవడం మంచిది.

Telugu Cotton Dresses, Tips, Itchy Rashes, Skin Rashes, Sweat-Telugu Health

ఎందుకంటే వేసవికాలంలో కాటన్ దుస్తులు ధరించడం వలన చెమట అలాగే హానికరమైన కిరణాల నుండి అది రక్షణ ఇస్తుంది.అలాగే శరీరంపై చిన్న బొబ్బలు ఏర్పడుతూ ఉంటాయి.ఈ బొబ్బలు అండర్ ఆర్మ్స్, మెడ వంటి చర్మ పొరలపై ఎక్కువగా కనిపిస్తాయి.ఈ పరిస్థితిని నివారించడానికి ఎండాకాలంలో వదులుగా ఉండే డ్రెస్ లను, కాటన్ డ్రెస్ లను ఉపయోగించాలి.

అలాగే కాటన్ దుస్తులు ధరించడం వలన బయటగాలి కూడా శరీరానికి బాగా తగులుతుంది.అలాగే చెమట కూడా త్వరగా ఆరిపోయి, శరీరం ఎల్లప్పుడూ కూల్ గా ఉంటుంది.

Telugu Cotton Dresses, Tips, Itchy Rashes, Skin Rashes, Sweat-Telugu Health

ఇక అధికంగా నీరు తాగడం కూడా మంచి విషయం అని చెప్పాలి.ఒంట్లో వేడి తగ్గడానికి అధికంగా నీరు తాగడం చాలా మంచిది.ఇది డిహైడ్రేషన్ రాకుండా హైడ్రేటెడ్ గా ఉండేందుకు సహాయపడుతుంది.అంతేకాకుండా హైడ్రైటింగ్ ఫ్రూట్స్, కూరగాయలను కూడా తినాలి.ఇక శరీరాన్ని ఎప్పుడు కూడా తడిగా ఉండనివ్వకూడదు.స్నానం చేస్తున్న వెంటనే చర్మాన్ని బాగా ఆరబెట్టుకోవాలి.

చెమట పట్టిన దుస్తులను కూడా వెంటనే మార్చుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube