పది నిమిషాల్లో ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చే సింపుల్ రెమెడీ ఇదే!

అసలే ఎండాకాలం.ఈ సీజన్ లో ఎండల దెబ్బకు తరచూ ముఖం డార్క్ గా మరియు డల్ గా మారుతుంటుంది.

 Make Your Face Whiter And Brighter Within Ten Minutes With This Remedy! Simple R-TeluguStop.com

అయితే అలాంటి ముఖ చర్మాన్ని కేవలం పది నిమిషాల్లోనే తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ మ్యాజికల్ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక నిమ్మకాయను తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.

ఆ తర్వాత నిమ్మ తొక్క( lemon peel ) మాత్రమే వచ్చేలాగా సన్నగా తురుముకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నిమ్మ తొక్క తురుమును వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగ‌ర్‌ వేసుకోవాలి.చివ‌రిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు( Turmaric ), వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత వేళ్ళతో సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఫైన‌ల్ గా మంచి మాయిశ్చరైజర్ ను చర్మానికి అప్లై చేసుకోవాలి.

ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే చర్మం పై పేరుకుపోయిన మురికి మృత కణాలు తొలగిపోతాయి.

ముఖ చర్మం క్షణాల్లో తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.అలాగే రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే మొటిమలు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మొండి మచ్చలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

కాబట్టి డార్క్ గా మరియు డల్ గా ముఖం ఉన్నప్పుడు ఈ సింపుల్ రెమిడీని పాటించండి.క్షణాల్లో ముఖాన్ని తెల్లగా మ‌రియు కాంతివంతంగా మెరిపించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube