ముఖం తెల్లగా మెరిసిపోవాలని చాలా మంది మార్కెట్‌లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్‌ను కొనుగోలు చేసి యూస్ చేస్తుంటారు.ఎంతో ఖరీదు ఉండే ఆ క్రీమ్స్ ను వాడటం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు గానీ.
ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ క్రీమ్‌ను వాడితే మాత్రం ముఖం ఎంత నల్లగా ఉన్నా తెల్లగా, కాంతివంతంగా మారడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోం మేడ్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక చిన్న కప్పు పచ్చి పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి గిన్నెను పెట్టుకోవాలి.
ఆ తర్వాత అందులో కాఫీ, కార్న్ ఫ్లోర్ కలిపిన పాలను వేసి.దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి.

ఇలా ఉడికించుకున్న మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.కంప్లీట్‌గా కూల్ అయిన వెంటనే అందులో రెండు టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్ జెల్, రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకుంటే.స్కిన్ వైట్నింగ్ క్రీమ్ సిద్ధం అయినట్లే.ఈ క్రీమ్‌ను ఒక బాక్స్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే పది నుంచి ఇరవై రోజుల పాటు వాడుకోవచ్చు.ఉదయం స్నానం చేయడానికి గంట ముందు, రాత్రి నిద్రించడానికి ముందు ఈ క్రీమ్‌ను అప్లై చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ హోం మేడ్ క్రీమ్ ను యూస్ చేస్తే మీ ముఖ చర్మం ఎంత నల్లగా ఉన్నాసరే తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.