దుంప జాతికి చెందిన కూరగాయల్లో కంద( Yam ) ఒకటి.చాలా మంది కంద తినడానికి పెద్దగా ఇష్టపడరు.
కానీ అనేక పోషకాలకు కంద గొప్ప మూలం.ఆరోగ్య పరంగా కంద అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ముఖ్యంగా కీళ్ల నొప్పులతో( Joint Pains ) బాధపడుతున్నవారికి కంద ఒక వరమనే చెప్పుకోవచ్చు.కంద దుంపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
కందలో మెండుగా ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢపరచడంలో తోడ్పడతాయి.కంద కండరాల నొప్పులను కూడా దూరం చేయగలదు.
సాధారణ కీళ్ల నొప్పులున్నవారు, అర్తరైటిస్( Arthritis ) ఉన్నవారు తగిన మోతాదులో కందను తింటే ఎంతో ప్రయోజనకరం.గౌట్ ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా తీసుకుని తినడం మంచిది.
అలాగే కంద దుంపలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.నీరసాన్ని తరిమికొడుతుంది.
కందలో విటమిన్ బి6 ఉంటుంది.ఇది నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మెదడును చురుగ్గా మార్చుస్తుంది.

ఆడవారు వారానికి ఒకసారి కంద దుంపను తింటే చాలా మంచిది.కందలో డయోస్జెనిన్ అనే రసాయనం హార్మోన్లను సమతుల్యం చేయడంలో హెల్ప్ చేస్తుంది.ఋతుస్రావ సమస్యలను తగ్గిస్తుంది.
కంద దుంపలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కణ నాశనాన్ని నివారిస్తాయి.క్యాన్సర్ సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
కంద దుంపలో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

అంతేకాదండోయ్.కంద దుంపలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది.కందలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.ఇక కంద దుంపలో ఉండే పలు రకాల విటమిన్లు చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మెరవడానికి చక్కగా సహాయపడతాయి.కాబట్టి, ఇకపై కంద కనపడితే అస్సలు వదిలిపెట్టొద్దు.