సూర్యాపేట జిల్లా:మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అనుబంధ ఉద్యోగ సంఘమైన మాదిగ ఉద్యోగుల సమాఖ్య (ఎంఇఎఫ్) జిల్లా ఉపాధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన తాడ్వాయి తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ నెమ్మాది ఉపేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయారు.
జిల్లా కేంద్రంలోని ఐబిఎస్ సెమినార్ హాల్ నందు జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మంద దేవేంద్రప్రసాద్,జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న, రాష్ట్ర కోశాధికారి చింత జాన్విల్సన్,రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉట్కూరు జానకిరాములు సమక్షంలో జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది.
మంగళవారం డాక్టర్ నెమ్మాది ఉపేందర్ మాట్లాడుతూ…తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు మంద దేవేంద్రప్రసాద్,జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు,
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న, రాష్ట్ర కోశాధికారి చింత జాన్విల్సన్,రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉట్కూరు జానకిరాములు మరియు ఇతర జాతీయ,రాష్ట్ర,జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.మాన్యులు,పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీల ఎబిసిడి వర్గీకరణ సాధించటంతో పాటు దళిత, గిరిజన,బడుగు,బలహీన, వెనుకబడిన వర్గాల బహుజన సమాజ శ్రేయస్సుకై జరిగే ఉద్యమాలు,పోరాటాలలో తన వంతు పాత్రను పోషిస్తూ తన మేధస్సు,కలం,గళంతో ఉద్యమాలకు ఊపిరి పోస్తానని తెలిపారు.