యాదాద్రి భువనగిరి జిల్లా:పాడి రైతుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంగళవారం ఉదయం 9 గంటలకు యాదగిరిగుట్ట విజయ డైరీ వద్ద సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి రైతులతో కలిసి విజయడైరీ యాదగిరిగుట్ట ఇన్చార్జి బాలరాజుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ మాట్లాడుతూ యాదగిరిగుట్ట విజయ డైరీకి 35 గ్రామాల నుండి రోజుకు 6000 లీటర్లు రైతులు పాలు పోస్తున్నారని,ఒక్కో రైతుకు పాల బిల్లు సుమారు రూ.40 లక్షల వరకు రావాల్సి ఉందని,ఇప్పటికీ నాలుగు బిల్లులు పెండింగ్లో ఉండడం వలన సుమారు కోటి 60 లక్షల రూపాయలు రైతులకు చెల్లించవలసి ఉందన్నారు.ఈ పరిస్థితి రైతులకు ఇబ్బందిగా మారి అప్పులు చేసి పశువులకు దానా కొనుగోలు చేస్తున్నారని, వారి కుటుంబాల పోషణ కొరకు పాలనే నమ్ముకున్న రైతులను ఇబ్బందులు పెట్టడం సరైనది కాదన్నారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయ డైరీలో పాలు పోస్తున్న రైతులందరికీ బకాయిలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా పాల ఉత్పత్తిదారులకు వడ్డీ లేకుండా గేదెలను కొనుగోలు చేయడానికి రుణాలు ఇవ్వాలని,సబ్సిడీపై పశువులకు దాన సప్లై చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి బండి జంగమ్మ, సిపిఐ మండల సహాయకార్యదర్శి పేరబోయిన మహేందర్,సిపిఐ జిల్లా సమితి సభ్యులు బబ్బురి శ్రీధర్,మాజీ కోఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య,రైతు సంఘం నాయకులు పేరబోయిన బంగారి,విజయ డైరీ గుండ్లపల్లి చైర్మన్ కంబాల మహేష,సిపిఐ పట్టణ పట్టణ కార్యదర్శి గోపగాని రాజు,రైతులు కంబాల కృష్ణ, బొడ్డు యాదగిరి,పేరబోయిన సత్యం,కంబాల రాజు,బండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.







