వేసవికాలంలో దాహం నుంచి ఉపశమనం పొందడానికి ద్రవపదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి.ఎండాకాలంలో మనకు లభ్యమయ్యే వాటిలో చెరుకు రసం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది.
వేసవి ఎండల తీవ్రతకు ప్రజలు శీతల పానీయాలు వైపు మొగ్గుచూపుతున్నారు.వివిధ పనుల నిమిత్తం బయటకెళ్లే వారికి ఈ ఎండలతో తిప్పలు తప్పడం లేదు.
దీనివల్ల వీరంతా ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చెరుకు రసం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
ఎండాకాలంలో రోడ్డుమీద వెళ్తుంటే చెరుకు రసం వాహనాలు కనిపిస్తూ ఉంటాయి.
తక్కువ ధరకే దొరికే చెరుకు రసాన్ని తాగేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.వేసవిలో ఎక్కడ చూసినా జ్యూస్ షాప్ లు, చెరుకు రసం వాహనాలు ఎక్కువగా ఉంటాయి.
చెరుకు రసం తాగడంతో అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చెరుకు రసంలో ఉండే గ్లూకోజ్‌ను శరీరం చాలా వేగంగా తీసుకొని వెంటనే ఉపయోగించుకుంటుంది.చెరుకు రసం తక్షణ ఉత్తేజన్ని అందిస్తుంది.చెరుకు రసంలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
చెరుకు రసం వడదెబ్బ నుంచి కాపాడుతుంది.కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరుకు రసం ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది.
కిడ్నీలో రాళ్లు కరగడానికి, రాళ్లు విచ్ఛిన్నమై మూత్రంలో పోవడానికి చేరుకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది.

అల్లం, నిమ్మరసం కలిపి తీసుకుంటే రుచి బాగుండడంతో పాటు పోషకాలు మరో రూపంలోకి మారకుండా నిరోధిస్తాయి.దీంతో సహజసిద్ధ పోషకాలు శరీరంలోకి చేరుతాయి.ఇక అల్లం వగరు రుచిని ఇవ్వడంతో పాటు నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే చెరుకు రసంలో కలిపే ఐస్ తో జాగ్రత్తగా ఉండడమే మంచిది.ఎందుకంటే ఐస్ తయారీలో ఎక్కువగా నీటిని శుద్ధి చేయకుండా ఉపయోగిస్తారు.అందువల్ల ఐస్ లేకుండా చెరుకు రసం తాగడమే ఆరోగ్యానికి మంచిది.