మ‌హిళ‌ల్లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే కిడ్నీలు డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..జాగ్ర‌త్త‌!

కిడ్నీ వ్యాధుల‌తో మ‌ద‌న ప‌డుతున్న రోగుల సంఖ్య ఈ మ‌ధ్య కాలంలో బాగా పెరిగి పోతోంది.

అందులోనూ పురుషుల‌తో పోలిస్తే స్త్రీల‌నే కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వేధిస్తున్నాయి.

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో చోటుచేసుకున్న మార్పులు, ఒత్తిడి, నిద్ర‌లేమి, పెయిన్ కిల్ల‌ర్స్‌ను ఓవ‌ర్‌గా యూజ్ చేయ‌డం, మ‌ద్య‌పానం, అధిక బ‌రువు, మూత్రాన్ని ఎక్కువ స‌మ‌యం పాటు ఆపుకోవ‌డం, వాట‌ర్ స‌రిగ్గా తీసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కిడ్నీ ఫెయిల్యూర్‌, కిడ్నీ స్టోన్స్‌, కిడ్నీ క్యాన్స‌ర్‌, కిడ్నీ ఇన్‌ఫెక్షన్ త‌దిత‌ర కిడ్నీ వ్యాధులు సంభ‌విస్తుంటాయి.ఒక‌వేళ ఈ వ్యాధుల‌ను కాస్త ముందే గుర్తించి స‌రైన చికిత్స తీసుకుంటే.

మ‌రికొంత కాలం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించ‌వ‌చ్చు.అందుకే కిడ్నీ పని తీరును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి.

ఎవరికి వారు కిడ్నీల సంరక్షణపై దృష్టి సారించాలి.ముఖ్యంగా కిడ్నీలు డేంజ‌ర్‌లో ఉన్న‌ప్పుడు మ‌హిళ‌ల్లో కొన్ని కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి.

Advertisement

మ‌రి అవేంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఉన్న‌ట్టుండి బ‌రువు త‌గ్గ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, మూత్రంలో ర‌క్తం ప‌డ‌టం, రాత్రుళ్లు స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌క పోవ‌డం, కంటి చూపు తగ్గ‌డం, క‌ళ్ల చుట్టు వాపు వంటి ల‌క్ష‌ణాలు కిడ్నీ వ్యాధుల‌కు సంకేతాలుగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.అలాగే ఎప్పుడూ అల‌స‌ట‌గా ఉండ‌టం, కండరాల నొప్పులు, తిమ్మిర్లు, పాదాల వాపు, చ‌ర్మం పొడి బారిపోవ‌డం, రాత్రి పూట తరచూ మూత్ర విసర్జన కావ‌డం, న‌డుము నొప్పి, వాంతులు వంటి ల‌క్ష‌ణాలు సైతం కిడ్నీలు ప్ర‌మాదంలో ఉన్నాయ‌ని తెలిపే సంకేతాలే.కాబ‌ట్టి, పైన చెప్పిన ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తే గ‌నుక ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించి అన్ని ప‌రీక్ష‌ల‌ను చేయించుకోండి.

లేదంటే కిడ్నీ వ్యాధులు మ‌రింత ముదిరిపోయి.ప్రాణాలే రిస్క్‌లో ప‌డ‌తాయి జాగ్ర‌త్త‌.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు