భారీగా నల్ల బెల్లం, పట్టిక 10 లీటర్ల నాటు సారా పట్టివేత

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజక వర్గంలోని నూతనకల్ మండలం బక్కహేమ్లా తండా గ్రామపంచాయతీ ఆవాసం బోటికింద తండాలో అబ్కారీ శాఖ సీఐ బాలోజి నాయక్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.

తండాకు చెందిన గుగులోతు రాములుకు చెందిన వ్యవసాయ భూమిలో నాటు సారా తయారు చేయడానికి నిల్వ ఉంచిన 1350 కిలోల బెల్లం,50 కిలోల పట్టిక,10 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు.

వీటిని పాతులోతు రెడ్యా డంపు చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని, దీనిపై పూర్తి విచారణ జరిపి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని ఆబ్కారీ శాఖ సీఐ బాలోజి నాయక్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా నాటు సారా తయారు చేయడానికి ప్రయత్నించినా,తయారు చేసినా, నాటు సారాని సరఫరా చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.

ఈ సోదాల్లో ఎక్సైజ్ ఎస్సై గణేష్,సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్టీయార్ చేస్తున్న డ్రాగన్ సినిమా పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేస్తుందా..?