కొంతమంది హీరోయిన్స్ మేకప్ లేకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తారు.చెప్పాలంటే పుట్టుకతోనే మంచి రంగు, రూపంతో ఉంటారు.
ఇక వారికి మేకప్ వేయాల్సిన అవసరమే లేదు.కానీ ఈ మధ్య అందంగా ఉన్నప్పటికీ కూడా మేకప్ వేస్తున్నారు కొంతమంది హీరోయిన్లు.
అతి మేకప్ వల్ల కూడా ఉన్న అందాన్ని కోల్పోతున్నారు.ఇక మరి కొంతమంది ఫేస్ సర్జరీలు చేయించుకుంటూ అందమైన రూపాన్ని కోల్పోతున్నారు.
అయితే ఇదంతా పక్కన పెడితే శ్రియ శరన్ ది ఒకప్పటి ఫోటో బాగా వైరల్ అవుతుంది.
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రియ శరన్.
తన నటన పరంగా తెలుగు ఇండస్ట్రీలో మంచి మార్కులు సంపాదించుకుంది.తన అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
ఇక ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.
ఇక శ్రియ తొలిసారిగా 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.
ఇక ఈ సినిమా తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించింది.కానీ ఈ రెండు సినిమాలు అంతగా మెప్పించలేకపోయినా ఆ తర్వాత సంతోషం సినిమాలో నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
అలా వరుసగా ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నువ్వే నువ్వే, ఎలా చెప్పను వంటి సూపర్ హిట్ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది.కొన్ని సినిమాలలో సహాయ పాత్రలలో కూడా నటించింది.మంచి హోదాలో ఉన్న సమయంలోనే 2018లో ఆండ్రూ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది.ఇక తమకు ఒక పాప పుట్టగా ఆ విషయాన్ని చాలా రోజుల వరకు బయట పెట్టలేదు శ్రియ.

ఆ తర్వాత తానే ఆ విషయాన్ని తెలిసి అందరికి షాక్ ఇచ్చింది.ఇక సినిమాలకు దూరంగా ఉన్న కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో ఉంటుంది.నిత్యం తన భర్త తో దిగిన ఫోటోలను తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.పైగా ఆ ఫోటోలు చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.ఎందుకంటే ఆ ఫోటోలు ఫుల్ రొమాన్స్ తో నిండిపోయి ఉంటాయి.

లేటు వయసులో కూడా శ్రియ అందాలు ఏ మాత్రం కూడా తగ్గలేదు.ఇప్పటికీ యంగ్ హీరోయిన్ గా కనిపించడమే కాకుండా పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా స్టోరీ లో తను చదువుకున్న రోజుల్లో తన ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోను పంచుకుంది.
అందులో క్లాస్ రూమ్ లో టీచర్స్ డే రోజు తను చీర కట్టుకొని తన ఫ్రెండ్స్ తో ఫోటో దిగగా అందులో తను మధ్యలో నిలబడి ఉంది.ఇక అప్పట్లో శ్రియ చాలా అందంగా ఉన్నట్లు కనిపించింది.
నిజానికి ఇప్పటికంటే అప్పుడు మరింత తెల్లదనంతో కనిపిస్తుంది.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.