పోలీస్ అధికారిపై దాడి .. సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి జైలు శిక్ష

విధుల్లో వున్న పోలీస్ అధికారిపై దాడి చేసిన కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి సింగపూర్‌ కోర్ట్( Singapore Court ) సోమవారం 9 సంవత్సరాల 18 నెలల జైలు శిక్ష, 4 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.నిందితుడిని నిఖిల్ ఎం దుర్గుడే (25)గా ( Nikhil M Durgude ) గుర్తించారు.

 Indian-origin Jailed And Fined For Assaulting Singapore Police Officer Details,-TeluguStop.com

పోలీసులు అతనిపై మోపిన 8 ఆరోపణలపై నిఖిల్ నేరాన్ని అంగీకరించాడు.వీటిలో ఓ ప్రభుత్వాధికారి విధులకు ఆటంకం కలిగించడం, దాడి చేయడం, అక్రమంగా గంజాయిని కలిగి వుండటం, మెథాంఫేటమిన్ సేవించడం వంటి అభియోగాలు వున్నట్లు ది స్ట్రెయిట్స్ టైమ్న్ నివేదించింది.

శిక్ష విధించే సమయంలో కోర్ట్ మరో 15 అభియోగాలను కూడా పరిగణనలోనికి తీసుకుంది.దాడి సమయంలో నిఖిల్ సదరు పోలీస్ అధికారిపై దుర్భాషలాడాడని న్యాయమూర్తి జస్వేందర్ కౌర్ పేర్కొన్నారు.

నవంబర్ 5, 2020న సీనియర్ స్టాఫ్ సార్జెంట్ చువా మింగ్ చెంగ్,( Senior Staff Sergeant Chua Ming Cheng ) ఇన్‌స్పెక్టర్ జెంగ్ యియాంగ్‌తో( Inspector Zheng Yiyang ) సహా ముగ్గురు అధికారులు చీటింగ్ కేసులకు సంబంధించి బాలస్టియర్‌లోని సిటీ సూట్స్‌లోని యూనిట్‌లో ఆపరేషన్ నిర్వహించారు.ఈ సమయంలో నిఖిల్, ప్రకాష్ మతివానన్, మలాని నాయడు ప్రభాకర్ నాయుడు ఓ గదిలో వున్నట్లు గుర్తించారు.

పోలీసులు వచ్చిన విషయాన్ని గమనించి కూడా వీరు మాట్లాడుకుంటూ వున్నారు.దీంతో చువా వారిని గద్దించారు.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రకాష్ లేచి ఆయన మీదకు దూసుకెళ్లి దాడి చేశాడు.

Telugu Indianorigin, Zheng Yiyang, Methamphetamine, Nikhil Durgude, Seniorstaff,

ఈ సమయంలో ఇన్‌స్పెక్టర్ జెంగ్ తన సర్వీస్ రివాల్వర్‌ను తీసి సోఫాలో వున్న ఇద్దరిపై గురిపెట్టి.చువాపై దాడి చేయడం ఆపాలని హెచ్చరించాడు.అయితే ప్రకాశ్ ( Prakash ) ఇన్‌స్పెక్టర్ జెంగ్‌పై తిరగబడి.

తుపాకీని లాక్కొనే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో సార్జంట్ చువా లేచి ఇన్‌స్పెక్టర్‌కు సాయం చేసేందుకు ప్రయత్నించాడు.

కానీ నిఖిల్ అతనిని పదే పదే తన్నడంతో చువా మళ్లీ కిందపడిపోయాడు.నేలపై పడిపోయినప్పటికీ విడిచిపెట్టకుండా నిఖిల్ అతనిని కొడుతూనే వున్నాడు.

Telugu Indianorigin, Zheng Yiyang, Methamphetamine, Nikhil Durgude, Seniorstaff,

కొద్దిసేపటికి మరో ఇద్దరు అధికారులు యూనిట్‌లోకి ప్రవేశించడంతో నిఖిల్ , ప్రకాశ్‌లు సైలెంట్ అయ్యారు.అప్పటికే చువా తీవ్రగాయాలతో నేలపై పడివున్నారు.అనంతరం ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.నిఖిల్‌ను సెంట్రల్ పోలీస్ డివిజన్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు.అక్కడ చేసిన పరీక్షల్లో అతని మూత్రంలో మెథాంఫెటమైన్ సేవించినట్లు కనిపించింది.ఈ పెనుగులాటలో ప్రకాష్ పొత్తికడుపుపై తుపాకీ బుల్లెట్ గాయం కావడంతో అతనిని ఆసుపత్రికి తరలించారు.

దొంగతనం, మోసం, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు గాను ఆయనకు 2022 ఆగస్టులో మూడేళ్ల పది నెలల జైలు శిక్ష విధించింది కోర్ట్.ప్రభుత్వ ఉద్యోగిని గాయపరిచినందుకు నిఖిల్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడే అవకాశాలు వున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube