మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పేరిట కొత్త స్కీమ్

కరీంనగర్, ఏప్రిల్ 13: అన్ని వర్గాల ప్రజల చేరువకు ఇప్పటికే వివిధ సేవలను విస్తృతం చేసిన తపాల శాఖ ఇటీవలే పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో పాటుగా మహిళలకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది.

మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రత్యేకంగా 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్-2023' పేరిట కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టింది.

గత మార్చి 31నుంచి అమలులోకి వచ్చిన ఈ స్కీమ్ ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలనికరీంనగర్ డివిజనల్ పోస్టల్ ఎస్పీ వై.

వెంకటేశ్వర్లు కోరారు.ఈ మేరకు గురువారం పోస్టల్ ఎస్పీ ఈ స్కీమ్ వివరాలతో ఒక ప్రకటన విడుదల చేశారు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాను మహిళలు వారి కోసం ఓపెన్ చేసుకోవచ్చునని, వారి సంరక్షణలో మైనర్ బాలికలకు కూడా ఓపెన్ చేసుకోవచ్చునని తెలిపారు.

రూ.1,000 నుండి మొదలు కొని రూ.

2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చునని, ఈ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ వస్తుందని వివరించారు.

ఇంకా పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని పోస్టాఫీసులలో సంప్రదించాలని సూచించారు.అలాగే అన్ని వర్గాల ప్రజలకు పోస్టల్ పథకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఎస్పీ ఆ ప్రకటనలో ప్రజలను కోరారు.

మరోసారి పెళ్ళిచేసుకున్న శృంగార తార