బాల్క సుమన్ నీ స్థాయిని మించి మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటు రాజన్న సిరిసిల్ల జిల్లా :దొరల గడిల్లో బందీ వైన నీవు సీఎం రేవంత్ రెడ్డి విమర్శించడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సంగ స్వామి యాదవ్ మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా స్వామి యాదవ్ మాట్లాడుతూ సుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.తెలంగాణ ఉద్యమం పేరిట అమాయక విద్యార్థులను బలి తీసుకున్న సుమన్ కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని, తెలంగాణను లూటీ చేసే క్రమంలో ప్రాజెక్టుల పేరిట రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది మీ బి.ఆర్.ఎస్ పార్టీ కదా అని ప్రశ్నించాడు.దగా పడిన తెలంగాణను పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిన మాట వాస్తవం కాదా అని అన్నారు.ఇప్పటికైనా సుమన్ ముందు నీవు గడిలా పాలనను వీడి ప్రజాపాలనలోకి రా అప్పుడే నీకు జ్ఞానోదయమవుతుందని హితవు పలికాడు.
కబర్దార్ బాల్క సుమన్ కాంగ్రెస్ పార్టీని గాని, సీఎం రేవంత్ రెడ్డిని గాని విమర్శిస్తే ఊరుకునేది లేదు ఎక్కడికక్కడ ఊరికించి కొడతాం జాగ్రత్త అంటూ హెచ్చరించాడు.ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ సీఎం రేవంత్ రెడ్డి గురించి గానీ కనీస అవగాహన లేని వ్యక్తులు రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారని, గడిలా పాలనను ప్రజా పాలనగా మార్చినందుకా దిష్టిబొమ్మ దగ్ధం…? బిఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావుల అవినీతి, అక్రమాలను బయటపెడుతున్నందుకా దిష్టిబొమ్మ దగ్ధం అంటూ ప్రశ్నించారు.ప్రభుత్వం ఏర్పాటై కనీసం రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే ఆరోపణలు చేస్తున్నారని, ఇవేనా మీకున్న నైతిక విలువలని, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలిచి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వండి అంటూ హితవు పలికారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్,సీనియర్ నాయకులు కూరగాయల కొమరయ్య, తూo మధు, చిలుక రమేష్, నాగుల రాము గౌడ్, పాత సత్యలక్ష్మి,పీర్ మహమ్మద్, సోయినేని కరుణాకర్, వస్తాదు కృష్ణ, లింగంపల్లి కిరణ్, ఎర్ర శ్రావణ్ , మహాదేవుని అంజయ్య,విజయ్, రాజు, వనపర్తి శంకర్, షేక్ ఫిరోజ్, తౌట్ సాయి నక్క సాయి తదితరులు ఉన్నారు