రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ ను గురువారం జిల్లా విద్యాధికారి ఏ.రమేష్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా డిఇఓ తరగతి గదులలో ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు.
అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులందరూ ప్రణాళికలు రూపోందించుకోని, పట్టుదలతో మంచి ఫలితాల సాధనాకై కృషి చేయాలని ,గత సంవత్సరం పదవ తరగతిలో మంచి ఫలితాలు రావడం అభినందనియమన్నారు.
అలాగే రానున్న రోజుల్లో సైతం ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాలోనే ఆదర్శవంతమైన పాఠశాలగా పేరు పొందేందుకు పోటిపడాలన్నారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విధంగా విద్యా బోధన చేసి విద్యార్థులను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా పాటుపడాలన్నారు.పాఠశాలలో విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరులను పరిశీలించి, పాఠశాల స్థితిగతులను ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు.