సజావుగా రైతుల రుణమాఫీ చేసేందుకు సన్నద్దం కావాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతు రుణమాఫీ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రైతు రుణ మాఫీ సన్నద్దత పై బ్యాంకర్లతో రివ్యూ నిర్వహించారు.

 Preparations Are Needed To Waive Farmers Loans Smoothly District Collector Sande-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రుణమాఫీ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.61 వేల 343 రైతులు ఉండగా ఇందులో 40వేల 567 మంది రైతులకు 240 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని, 10వేల 756మంది రైతులకు ప్రాసెస్ లో కలదని,మిగిలినవి వివిధ సాంకేతిక (ఆధార్ లింకేజీ లేకపోవడం ఆధార్ నెంబర్ తప్పుగా ఇవ్వడం మరణించిన రైతులు ) మొదలగు ఇతర కారణాల వలన రుణమాఫీ జరుగలేదని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023మధ్యలో తీసుకున్న రైతు రుణ మాఫీ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు.రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ రుణమాఫీ ఫలితం చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు.

గతంలో వచ్చిన విధంగా సాంకేతిక సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.బ్యాంకుల వారీగా రైతుల రుణ ఖాతా వివరాలు కలెక్టర్ ఆరా తీశారు.

రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ అయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు.రుణమాఫీ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ముందస్తుగానే రైతుల బ్యాంకు ఖాతా ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభించాలని, ఆధార్ నెంబర్ ఆధారంగా డూప్లికేట్ బ్యాంకు ఖాతాలను గుర్తించి శనివారం నాటికి నివేదిక సమర్పించాలని అన్నారు.

ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జున్, డి.ఏ.ఓ భాస్కర్ ఇతర సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube