అర్హులకు మహిళశక్తి అందించాలి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: అర్హులకు మహిళశక్తి పథకం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో డీఆర్డీఓ శాఖ అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్షించారు.

 Women Empowerment Should Be Provided To The Deserving Collector Sandeep Kumar Jh-TeluguStop.com

మహిళశక్తిలో భాగంగా జిల్లాలోని 31 ఎస్ హెచ్ జీ గ్రూపులకు స్కూల్ విద్యార్థులకు 34,387 యూనిఫాంలు కుట్టించి పంపిణీ చేశామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు అధికారులు తెలిపారు.

ఉపాధి హామీ పధకం లో భాగంగా జిల్లాలో ఎంత మందికి జాబ్ కార్డులు ఉన్నాయి? ఇప్పటిదాకా ఎంత మందికి ఉపాధి కల్పించారో కలెక్టర్ ఆరా తీయగా, జిల్లాలో మొత్తం 97883 జాబ్ ఉన్నాయని, 61, 465 మందికి ఉపాధి కల్పించామని డీఆర్డీఓ తెలిపారు.బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి, పీఎంఎఫ్ఎంఈ పలు అంశాలపై చర్చించారు.ఈ సమావేశంలో డీఆర్డీఓ శేషాద్రి, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube