అర్హులకు మహిళశక్తి అందించాలి – కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా: అర్హులకు మహిళశక్తి పథకం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో డీఆర్డీఓ శాఖ అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్షించారు.

మహిళశక్తిలో భాగంగా జిల్లాలోని 31 ఎస్ హెచ్ జీ గ్రూపులకు స్కూల్ విద్యార్థులకు 34,387 యూనిఫాంలు కుట్టించి పంపిణీ చేశామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు అధికారులు తెలిపారు.

ఉపాధి హామీ పధకం లో భాగంగా జిల్లాలో ఎంత మందికి జాబ్ కార్డులు ఉన్నాయి? ఇప్పటిదాకా ఎంత మందికి ఉపాధి కల్పించారో కలెక్టర్ ఆరా తీయగా, జిల్లాలో మొత్తం 97883 జాబ్ ఉన్నాయని, 61, 465 మందికి ఉపాధి కల్పించామని డీఆర్డీఓ తెలిపారు.

బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి, పీఎంఎఫ్ఎంఈ పలు అంశాలపై చర్చించారు.ఈ సమావేశంలో డీఆర్డీఓ శేషాద్రి, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పసిఫిక్ కింద దాగిన అద్భుతమైన మెగాస్ట్రక్చర్.. దాన్ని చూసి శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం..