ఆరోగ్యంగా, ఫిట్ గా జీవించాలి అంటే పోషకాహారం ఎంత ముఖ్యమో నిద్ర( Sleep ) అంతకంటే ఎక్కువ ముఖ్యం.ఆహారం లేకపోయినా కొద్ది రోజులు ఉంటారు.
కానీ నిద్ర లేకపోతే మాత్రం రెండు రోజుల్లోనే మనిషి నీరసపడిపోతాడు.ముఖ్యంగా మహిళలు రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలి.
లేదంటే ఎన్నో డేంజరస్ సమస్యలు తలెత్తుతాయి.మహిళలు మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు.
ఇంట్లో పని, ఆఫీస్ లో పని, భర్త పిల్లలను చూసుకోవడం.ఇలా అన్నీ తామై చూసుకుంటారు.
ఈ క్రమంలోనే తిండి, నిద్ర, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.కానీ మహిళలు ( Women )ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు అంత సౌఖ్యంగా ఉంటుంది.అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.పోషకాహారం తీసుకోవాలి.
మరీ ముఖ్యంగా కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల మహిళల హార్మోన్లలో మార్పులు తలెత్తుతాయి.
దీని కారణంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సంతానలేమి, థైరాయిడ్( Thyroid ) తదితర సమస్యలన్నీ తలెత్తుతుంటాయి.

అలాగే మహిళలు నిద్రను నిర్లక్ష్యం చేస్తే శరీర బరువు అదుపు తప్పుతుంది.భారీగా వెయిట్ గెయిన్ అవుతారు.నీరసం, అలసట ఎప్పుడు చుట్టూనే తిరుగుతాయి.
తీవ్రమైన తలనొప్పి,( headache ) మెదడు పనితీరు తగ్గడం, మైగ్రేన్ వంటి సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల మహిళల్లో గుండెపోటు వచ్చే రిస్క్ బాగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు ఎప్పుడూ తిరుగుతూ పనులు ధ్యాసలోనే పడిపోకుండా నిద్రపై కూడా కాస్త శ్రద్ధ వహించండి.రోజుకు 7 నుంచి 8 గంటలు పడుకోండి.ప్రతిరోజూ అందరికంటే ఉదయం నిద్ర లేచేది మీరే కాబట్టి రాత్రి అయినా సరే అందరికంటే త్వరగా నిద్రించండి.కంటి నిండా నిద్ర ఉంటే ఎన్నో జబ్బులకు దూరంగా ఉండవచ్చు.
సరిపడా నిద్ర ఉంటే రోజంతా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.