కార్తీక సోమవారం శివునికి ప్రీతికరం కావడంతో శివాలయాలను దర్శించడం శుభం.ఈ మాస ప్రారంభం నుంచి సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, స్త్రీలు నదులలో, కోనేటిల్లో దీపాలు వదులుతారు.
ఇంకా కార్తీక మాసంలో దీపాన్ని దానం ఇస్తే… మాంగల్యబలం, కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం.
అలాగే కార్తీక సోమవారం నాడు శివాలయాల్లో నేతితో దీపమెలిగించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.సోమవారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలకు చేరుకుని పంచముఖం గల దివ్వెలతో దీపాలను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
కార్తీకమాసం నెలరోజులు దీక్షలో ఉండవచ్చు.
అలా లేనివారు కనీసం కార్తిక సోమవారాలైనా కొన్ని నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెపుతుంది.సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు.
సోమవారానికి అధిపతి చంద్రుడు.చంద్రుడు మనః కారకుడు.మనస్సును అదుపులో పెట్టుకోవాలనుకునేవారు అంటే అనవసరమైన కోరికలవైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం ఏది కాదు తెలుసుకుని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారాలు ప్రాతఃకాలాన్నే స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడిని చూసాక భోజనం చేయడం మంచిది.
ఒక సర్వేలో కూడా తేలిన విషయం ఏమిటంటే సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించేవారి శాతం మిగతా వాడుకంటే ఎక్కువగా ఉంటుంది.కారణం చంద్రుడు.మనస్సు చాలా చంచలమైనది.
అది ఒకరి మాటవినదు.తనకు తోచినట్లు తాను చేసుకుంటూ వెళుతుంది.
దానిని అదుపులో పెట్టుకోవడం మానవునిగా ప్టుడునందుకు మన కర్తవ్యం.ఆ కర్తవ్యాన్ని మరచి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేసామని, పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుటాంరు.
ఇది ఎంతమాత్రం సరియైనది కాదు.మనస్సును అదుపులో పెట్టుకోవడం అందరికీ అవసరమే కాబ్టి అందరూ తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారాల వ్రతం చేయాలి.
DEVOTIONAL