దుర్గమ్మకు మూడోరోజు ఈ నైవేద్యం సమర్పిస్తే అన్నీ శుభాలే..!

దేవీ నవరాత్రులు ప్రారంభం అయ్యాయి.మూడో రోజు అయిన నేడు అమ్మవారు చంద్రఘంట దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు.

 These Naivedyam Is Very Useful To Provide Third Day In Navaratri Time Details, C-TeluguStop.com

అయితే ఈరోజున అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలని చాలా మంది అనుకుంటారు.కొబ్బరి అన్నం నేడు నైవేద్యంగా సమర్పిస్తే మంచి జరగుతుందని వేద పండితులు చెబుతున్నారు.అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

.నూనె, జీడిపప్పు, బుడ్డపప్పు, పోపు దినుసులు, తరిగిన అల్లం ముక్కలు, పచ్చి మర్చిలు, కరివేపాకు, ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఉడికించిన అన్నం, ఉప్పు.

తయారీ విధానం.

.ముందుగా అమ్మవారిని తలుచుకొని నైవేద్యం చేయడానికి వంట మదలు పెట్టాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒఖ ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల నూనె వేసి అందులో బుడ్డ పప్పు, జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి.

Telugu Coconut, Dasara, Devi Navaratri, Durga Mata, Kobbari Annam, Kobbari-Lates

ఆ తర్వాత పోపు దినుసులు వేసి పచ్చిమిర్చీలు తగినంత వేసుకొని బాగా వేగనివ్వాలి.ఆ తర్వాత కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కమ్మటి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి.తర్వాత అందులో ఉడికించిన అన్నం వేసుకోవాలి.

అనంతరం ఉప్పు వేస్కొని బాగా కలుపుకోవాలి.ఇక కొబ్బరి అన్నం తయారైనట్లే.

అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనసులో ఉన్న కోరికలను కోరుకోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube